Food

పరగడుపున నిమ్మరసం తాగాలి

నిమ్మకాయ శరీరంలో శక్తివంతమైన ఆల్కలీన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు ఆసిడ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. వాపులను, దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది. నిమ్మకాయలో 22 క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇది జంతువుల్లో క్యాన్సర్ కణితుల పెరుగుదలను నిలిపివేస్తుందని గుర్తించారు. వేసవి తాపాన్ని అధిగమించేందుకు.. శీతాకాలపు ఉదయాన్ని కిక్‌స్టార్ట్‌ చేయడంలో నిమ్మకాయ నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అన్ని కాలాల్లో వినియోగించేందుకు వీలున్న పండు.

* బరువు తగ్గించడంలో..
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ రసం త్రాగడాన్ని సదా సిఫార్సు చేయవచ్చు. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌ను నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం తీవ్రతను దూరంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థలో తేలియాడే విషపదార్థాలను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అజీర్ణంతో పాటు వచ్చే బాధాకరమైన లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరంలోని జీవక్రియను పెంచి అదనపు కొవ్వును వదిలించుకోవచ్చు. ఫలితంగా శరీరం బరువును తగ్గించుకోవచ్చు.

* మెరుపు చర్మం కోసం..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వెచ్చని, యాంటీఆక్సిడెంట్ రిచ్ లెమన్ వాటర్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్‌గా చెప్పుకవచ్చు. నిత్యం నిమ్మరసం తీసుకోవడం వల్ల ప్రకాశవంతమైన, మెరుపుతో కూడిన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

* వాపును నివారించడంలో..
నిమ్మకాయ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, కొంత మొత్తంలో విటమిన్ బీ ఉండి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి దీర్ఘకాలిక మంటను నివారించడంలో సహాయపడతాయి. దీనిలోని సీ విటమిన్ ఆహారం నుంచి ఐరన్‌ను గ్రహించడంలో తోడ్పడుతుంది. హిమోగ్లోబిన్ సరిగా ఉండేలా కాపాడుతుంది.

* రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో..
నిమ్మ నీరు ఆస్కార్బిక్ యాసిడ్ అద్భుతమైన మూలం. ఇది శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. దీనిలోని సీ విటమిన్.. ఫ్లూ, జలుబు నుంచి రక్షిస్తుంది. వ్యాధికారకాలు, వివిధ వైరస్‌ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

* సోడాలకు ప్రత్యామ్నాయం
సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి కృత్రిమ చక్కెర పానీయాలు తీసుకునే వారిలో పలు ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. నిమ్మకాయ నీరు చక్కెరలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. నిమ్మ నీరు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రంగా చురుకుగా పనిచేయడంలో నిమ్మరసం గ్రేట్‌గా సహాయపడుతుంది.

* మరీ ఎక్కువొద్దు..
ఈ పానీయాలను క్రమం తప్పకుండా తాగడం కూడా మంచిది కాదని సెలవిస్తున్నారు నిపుణులు. నిత్యం ఎక్కువ మొత్తంలో నిమ్మరసం తీసుకునేవారిలో ఒకేసారి శరీరం బరువు పెరగడం, ఊబకాయం, టైప్‌ 2 డయాబెటీస్‌, గుండె సంబంధ వ్యాధులు కనిపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తుననారు. రెగ్యులర్‌గా తీసుకునే వారిలో దంతాల ఎనామిల్‌ సమస్యలు వస్తుంటాయి. కడుపు నొప్పితోపాటు గ్యాస్ట్రిక్‌ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఎక్కువగా నిమ్మరసం తీసుకోవడం ఆస్టియో ఆర్థరైటీస్‌కు కారణమవుతుంది. నిమ్మలోని సిట్రిక్‌ యాసిడ్‌ నోటిపూతలను ప్రేరేపిస్తుంది. అందుకని ఎక్కువ మొత్తంలో నిమ్మరసం తీసుకోకుండా జాగ్రత్తపడటం ఉత్తమం.