WorldWonders

కాంగోలో చింపాంజీల అపహరణ. సొమ్ముల కోసం డిమాండ్.

కాంగోలో చింపాంజీల అపహరణ. సొమ్ముల కోసం డిమాండ్.

డబ్బుల కోసం చిన్నారులను కిడ్నాప్‌ చేసిన వార్తలను చూస్తుంటాం. కానీ, ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో మాత్రం మూడు చింపాంజీ(Chimpanzee)లను అపహరించడం గమనార్హం. ఇలా జరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారని కేంద్రం నిర్వాహకులు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఇటీవల ఇక్కడి లబుంబాషిలోని ఓ జంతు సంరక్షణ కేంద్రం(Sanctuary)లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. అక్కడ సంరక్షణలో ఉన్న అయిదు పిల్ల చింపాంజీల్లో మూడింటిని ఎత్తుకెళ్లారు. మిగిలిన రెండు చింపాంజీలను అనంతరం వంటగదిలో గుర్తించినట్లు కేంద్రం వ్యవస్థాపకుడు ఫ్రాంక్ చాంటెరో తెలిపారు. డబ్బుల కోసం చింపాంజీ పిల్లలను కిడ్నాప్ చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని ఆయన వెల్లడించారు.