Kids

మీ శిశువు ఏడుపు ఆపట్లేదా?

మీ శిశువు ఏడుపు ఆపట్లేదా?

ఏడుస్తున్న శిశువులను తల్లులు భుజానకెత్తుకుని, అయిదు నిమిషాలు అటూ ఇటూ నడిస్తే బిడ్డలు ఏడుపు ఆపేయడం ఖాయమని జపాన్‌కు చెందిన రికెన్‌ సెంటర్‌ ఫర్‌ బ్రెయిన్‌ సైన్స్‌ పరిశోధకులు చెబుతున్నారు. జోలపాడితే మరీ మంచిదని వెల్లడించారు. ఈ మేరకు వారు 21 మంది చిన్నారులపై పరిశోధన సాగించారు. తల్లులు తమ బిడ్డలను ఒడిలో కూర్చోబెట్టుకున్నప్పుడు, భుజానకెత్తుకుని నుంచున్నప్పుడు, భుజంపై వారిని ఎత్తుకుని అటూ ఇటూ నడుస్తున్నప్పుడు చిన్నారుల్లో వచ్చే మార్పులను గమనించారు. తల్లి అటూఇటూ తిరగడం ప్రారంభించిన 30 సెకెండ్లలోనే బిడ్డల్లో హార్ట్‌ రేట్‌ తగ్గి, వారిలో మానసిక మార్పులు చోటుచేసుకుంటున్నట్టు గుర్తించారు. ఇదే వారు ఏడుపు ఆపడానికి, కొన్నిసార్లు నిద్రలోకి జారుకోవడానికి కూడా కారణమవుతున్నట్టు పరిశోధకులు వివరించారు.