Sports

బ్లాక్‌లో…ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర ₹11వేలు

ఉప్పల్‌ స్టేడియం సమీపంలో బ్లాక్‌ టికెట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేడియంకు సమీపంలో టికెట్లను విక్రయిస్తున్న గగులోత్‌ వెంకటేష్‌, ఇస్లావత్‌ దయాకర్‌, గగులోత్‌ అరుణ్‌ అనే ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.850 విలువ చేసే టికెట్‌ను రూ.11,000కి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు టికెట్లు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఉప్పల్‌ పోలీసులు వాటికి ఎస్‌ఓటీ పోలీసులకు అప్పగించారు.