Politics

చెల్లెమ్మకు చేదు అనుభవం.

చెల్లెమ్మకు చేదు అనుభవం.

◆ కల్వకుంట్ల కవిత ‘గో బాక్ అంటూ నినాదాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఆమె రంగారెడ్డి కోర్టుకు వెళ్లారు. అయితే కవితను పలువురు న్యాయవాదులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఎప్పుడూ తమ సమస్యలను పట్టించుకోలేదని.. ఇప్పుడెలా కోర్టు వద్దకు వస్తారని ఆమెను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతులు లేవని.. ఎవరైనా అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.