Devotional

దుబాయిలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు

దుబాయిలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు

కరోనా ఆంక్షల కారణాన గత మూడెళ్ళుగా సాంస్కృతిక మరియు సాంఘీక జీవన స్రవంతికు దూరంగా ఉన్న గల్ఫ్ లోని తెలంగాణ ప్రవాసీయులను ఈ సారి బతుకమ్మ ఉత్సవాలు ఎనలేని ఉత్సాహంతో ఉరకలు పెట్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా సౌదీ అరేబియాతో సహా అన్ని గల్ఫ్ దేశాలలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
22
upload pic net

ఈ మెరకు దుబాయి కేంద్రంగా పని చేసే ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐ.పి.యఫ్) ఆధ్వర్యంలో కూడ ఆజ్మాన్ లోని మైత్రి ఫాం హౌస్ లో ఐ.పి.యఫ్ తెలంగాణ కౌన్సిల్ కన్వీనర్ కుంభాల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుకోన్నారు. వివిధ ఏమిరేట్ల నుండి హిళలు బతుకమ్మలు తయారు చేసుకొని వచ్చి బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు ఘనంగా నిర్వహించుకోగా అందులో ఉత్తమ బతుకమ్మలు చేసిన అడ్లగట్ట రజితకు పట్టుచీర బహుమతిగా మరియు దూంపేట తన్వీకు బంగారం నాణం బహుమతిగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గోన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీ రంజిత్ కోడూర్, కౌన్సిల్ కన్వీనర్ చైర్మన్ సుజిత్ కుమార్, దుబాయ్ విభాగం అద్యక్షుడు ప్రదీప్ మురళిలతో పాటు రాంజీ ,రాజేష్ నాయర్, జయరాం ,హరికుమార్ ,శరత్ గౌడ్, అశోక్ , హనీ యాదవ్ ,రమేష్ ,దీపిక, నవనీత్, వేణు, కృష్ణ ,రవికుమార్ రాజు, మదన్, రాజ్ ,డొక్కా శ్రీనివాస్ లు పాల్గొనడం జరిగింది.

భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కుంభాల మహేంద్ర రెడ్డి పెర్కోన్నారు.
21