Devotional

ఖతార్ లో బతుకమ్మ వేడుకలను ప్రారంభించిన భారత రాయబారి

ఖతార్ లో బతుకమ్మ వేడుకలను ప్రారంభించిన భారత రాయబారి

కరోనా ఆంక్షల కారణాన గత మూడెళ్ళుగా సాంస్కృతిక మరియు సాంఘీక జీవన స్రవంతికు దూరంగా ఉన్న గల్ఫ్ లోని తెలంగాణ ప్రవాసీయులను ఈ సారి బతుకమ్మ ఉత్సవాలు ఎనలేని ఉత్సాహంతో ఉరకలు పెట్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా గల్ఫ్ దేశాలలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
122

ప్రపంచ ఫుట్ బాల్ పోటీలకు సిద్ధం చేసిన స్టేడియంలు ఈ సారి తెలంగాణ బతుకమ్మ సంబురాలకు వేదికగా మారాయి. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఖతర్ లో జరిగిన బతుకమ్మ సంబరాలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఖతర్ లో జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం ఖతర్ ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక స్టేడియంల వద్ద బతుకమ్మలతో పాట విడుదల చేశామని తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని చెప్పారు.

భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గోన్న సభికులను ఉద్దెశించి ఎమ్మెల్సీ కె. కవిత విడియో సందేశాన్ని వినిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖతర్ భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆయన సతీమణి అల్పన మిట్టల్ హాజరు కాగా ఐసీబీఎఫ్ అధ్యక్షులు వినోద్ నాయర్ ,ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి, ఐసీబీఎఫ్ ఎంసీ రజినీ మూర్తిలు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
125

సాంస్కృతిక కార్య్రమాల్లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆట పాటలతో అలరించగా గల్ఫ్ కార్మిక సోదరులు సైతం పల్లె పాటల తో ధూమ్ దాం గా పాల్గొన్నారు. వివిధ రకాలుగా గల్ఫ్ కార్మికులకు అండగా నిలుస్తున్న వారిని సన్మానించారు.
123