NRI-NRT

బే ఏరియాలో ఘనంగా WETA బతుకమ్మ!

బే ఏరియాలో ఘనంగా  WETA బతుకమ్మ!

కాలిఫోర్నియా బే ఏరియాలో “శనివారం” అక్టోబర్ 1 వ తేదీన “శాన్ రామోన్” నగరంలో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శాన్ రామోన్ స్పోర్ట్స్ పార్క్ లో నిర్వహించిన ఈ వేడుకలలో బే ఏరియాలోని వివిధ నగరాల నుంచే కాకుండా శాక్రమెంటో లాంటి సమీప పట్టణాల్లో నివసించే తెలగువారందరూ ఈ కార్యక్రమానికి ఉంటున్న తెలుగువారూ ఇక్కడికి విచ్చేసి సందడి చేశారు. దాదాపు 1000 మంది పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇండియన్ కాన్సులర్ జనరల్ Dr టీవీ నాగేంద్ర ప్రసాద్ గారు అయన సతీమణి పద్మావతి గారు వచ్చి విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) చేస్తున్న కార్యక్రమాలను తెలిసుకొని WETA టీం ని అభినందించారు. ఈ కార్యక్రమానికి శాన్ రామోన్ నగరానికి వైస్ మేయర్ తెలుగు వాడు అయిన శ్రీధర్ వేరోసి , పార్క్స్ చైర్ పర్సన్ ” హైది కెన్స్టన్ కూడా పాల్గొన్నారు. అలాగే బే ఏరియా లో వుండే వివిధ తెలుగు సంగాల సభ్యులు పాల్గొని సంఘీభావాన్ని తెలియ చేసారు. ప్రకృతి మురిసిపోయేట్టు రంగురంగుల పూలను పేర్చి ఆడుకునే రంగుల పండుగ బతుకమ్మ ఇక్కడ “కాలిఫోర్నియా లోని శాన్ రామోన్” నగరంలో “శాన్ రామోన్ స్పోర్ట్స్” పార్క్ ఆవరణలో ” బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని అనేక జానపద పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయ లో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. అంతా కలసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు.


మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో “బతుకమ్మ పండుగ” తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే. ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సర వేడుకలలు ప్రముఖ సినిమా తార /టీవీ Anchor ఉదయ భాను ప్రత్యేక ఆకర్షణ! ఉదయభాను గారు ఆహుతులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ “బతుకమ్మ ఆడడమే కాకుండా ” వివిధ కార్యక్రమాలతో కార్యక్రమానికి వచ్చిన వారందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి పలు తెలుగు పండుగ వంటకాలతో భోజన ఏర్పాట్లను చేసారు. కార్యక్రమం WETA ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ కి & మరియు మీడియా పార్టనర్స్ కి ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి గారు కృతజ్ఞతలు తెలియ చేసారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరిని WETA ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి కృతఙ్ఞతలు తెలియచేసారు! మరియు ఈ కార్యక్రమంలోlakshmi yana, yashaswini reddy joint Treasure కల్చరల్ చైర్ రత్నమాల వంక, WETA కోశాధికారి విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, RVP పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల, ప్రశాంతి కూచిబొట్ల joint secretary ,volunteer దివ్య, రేఖ, సునీత గంప, చందన రెడ్డి, మాధురి రెడ్డి, దివ్య, భువన్ వేమిరెడ్డి , మరియు అనేక మంది వాలంటీర్ మెంబెర్స్ పాల్గొని విజయ వంతం చేసారు.