NRI-NRT

సౌదీలో ఘనంగా దసరా-బతుకమ్మ

Dasara Batukamma 2022 In Riyadh Saudi

* రియాధ్ లో రంగవైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు
* రాంలీలాను మరిపించిన రావణా దహానం – సాటా ఉత్సవం

సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాట) అధ్వర్యంలో రియాధ్ నగరంలో జరిగిన దసరా మరియు బతుకమ్మ వేడుకలు తెలుగు ప్రవాసీ కుటుంబాలలో ఒక నూతనోత్తేజాన్ని నింపడంతో పాటు అధ్యాత్మిక మరియు సంస్కృతి, ఆచార వ్యవహారాల స్ఫూర్తిను ప్రతిబింబించాయి. లక్ష్మికు తోడుగా నెల్లూరుకు చెందిన తాటి శ్రీదేవి మల్లికార్జున్, గీతా శ్రీనివాస్, చిత్తూరుకు చెందిన పబ్బతి సింధూరలు చేసిన వేద మంత్రాల ఘోష పూర్తి స్ధాయిగా అధ్యాత్మిక వాతవారణాన్ని సృష్టించింది. దీనికి తోడుగా తెలంగాణ సంస్కృతి, కట్టు మరియు బొట్టుకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను కూడ విభిన్న పూలతో ప్రత్యెక నైవేద్యాన్ని వేద పండితుల పుట్టినిల్లయిన మంథనికు చెందిన లోకే సుధా ప్రశాంత్ గౌరి దేవికు సమర్పించడం ఉత్సవాన్ని మరింత రక్తి కట్టించింది. హైద్రాబాద్ కు చెందిన లావణ్య నాగార్జున, శ్వేత రియాజోద్దీన్, కండాల సుచరిత, నల్గోండకు చెందిన గౌతమిలు సుధాకు తోడయ్యారు. రెండు బతుకమ్మలు అనుకొన్నా ఔత్సిహిక మహిళలు ముందుకు రావడంతో సంఖ్య పదకొండుకు చేరుకోందని లోకె సుధా పెర్కోన్నారు. కేవలం తాను టివిలలో చూడడం తప్ప బతుకమ్మ గూర్చి ఇప్పటి వరకు తెలియదని గీతా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నెల్లూరుకు చెందిన అమె తన తల్లితో కలిసి జీవితంలో ప్రపధమంగా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గోన్నారు. కొలటాల కొలహలం ఉత్సహాన్ని మరింత రెట్టింపు చేయగా, పూర్తిగా భద్రత నియామాలు పాటిస్తూ సంప్రదాయకంగా చేసిన రావణ దహానం రామలీలా మైదాన్ని మరిపించింది. అందర్ని కలుపుకొంటూ అందరి సహాయంతో అన్ని పండుగలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సాటా నాయకులు మల్లేషన్, జి. అనందరాజు, ముజమ్మీల్, వినయ చేంగూరిలు పెర్కోన్నారు.

Dasara Batukamma 2022 In Riyadh Saudi