ScienceAndTech

ఈ యాప్‌లు వెంటనే తొలగించండి

ఈ యాప్‌లు వెంటనే తొలగించండి

సైబర్‌ నేరస్తులు తెలివి మీరారు. యూజర్ల మెటా యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లను దొంగిలించేందుకు 400 రకాలైన ప్రమాదకర యాప్స్‌ను తయారు చేశారు. ఆ యాప్స్‌ను సోషల్‌ మీడియా యూజర్లను వినియోగించేలా చేశారు.ఈ తరుణంలో మెటా ఆ యాప్స్‌ను గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఫోన్లలో ప్రమాదకరమైన యాప్స్‌ చెప్పింది. మెటా యూజర్ల పాస్‌వర్డ్స్, వ్యక్తిగత సమాచారం దొంగించడానికే సైబర్‌ కేటుగాళ్లు ఇలాంటి యాప్స్‌ చేసినట్లు వెల్లడించింది. ఫొటో ఎడిటర్స్‌ గేమ్స్, వీపీఎన్ సర్వీసెస్, బిజినెస్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తామంటూ సైబర్‌ నేరస్తులు యూజర్లకు యాప్స్‌ నోటిఫికేషన్‌లు పంపిస్తున్నారు. ఒకే వేళ నచ్చి యూజర్‌ వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే అంతే సంగతులు. ఎవరైతే యూజర్లు ఉన్నారో వారి వివరాల్ని సేకరించి.. వాటిని డార్క్‌ వెబ్‌లో అమ్ముకోవడంతో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆ యాప్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని మెటా తెలిపింది..

ఈజీ మనీకోసం సైబర్‌ నేరస్తులు తయారు చేసిన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు యాప్స్‌ రివ్వ్యూ, వాటి వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫేక్‌ రివ్వ్యూలతో యూజర్లను అట్రాక్ట్‌ చేసే అవకాశం ఉంది. అయితే.. ఏదైనా యాప్ మీరు దానిని ఇన్‌స్టాల్ చేసుకోకముందే లాగిన్ డీటెయిల్స్ అడిగితే వాటి జోలి వెళ్లకపోవడమే మంచిది. డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఉంటే ఓటీపీ ఆప్షన్‌ సెట్టింగ్‌ మార్చుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.