NRI-NRT

కువైత్ జనాభా కంటే ఆసియా ప్రవాసులే అధికం!

కువైత్ జనాభా కంటే ఆసియా ప్రవాసులే అధికం!

గల్ఫ్ దేశం కువైత్‌ జనాభా కంటే ప్రవాసులే అధికంగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. అయితే, ఖండాల వారీగా చూసుకుంటే మాత్రం ఆసియా వాసులు ఏకంగా ఆ దేశ పౌరుల కంటే ఎక్కువగా ఉన్నట్లు తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన డేటా ద్వారా తెలిసింది. పీఏసీఐ గణాంకాల ప్రకారం కువైటీల జనాభా 15,02,138గా ఉంటే.. ఆసియా ప్రవాసులు ఏకంగా 16,70,013 మంది ఉన్నారు. ఆ తర్వాత 1,217,014 మందితో అరబ్స్ మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు.ఇక నార్త్ అమెరికన్లు 755 మందితో నాల్గో స్థానంలో ఉంటే.. ఆ తర్వాత ర్యాంకుల్లో వరుసగా యూరోపియన్లు (617), నాన్-అరబ్ ఆఫ్రికన్లు(104), ఆస్ట్రేలియన్లు(43), సౌత్ అమెరికన్లు(40) ఉన్నారు. ఇక 16,70,013 మంది జనాభాతో తొలి స్థానంలో నిలిచిన ఆసియన్లలో భారతీయులే 10లక్షలకు పైగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే.. కువైత్ మొత్తం జనాభా 45లక్షల వరకు ఉంటే.. ఇందులో 65 శాతం వరకు వలసదారులే ఉన్నట్లు సమాచారం.