జాన్వీకపూర్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా.. ‘తన తెలుగు సినిమా ఎప్పుడు..?’ అనే టాపిక్కే వస్తుంది. జాన్వీని టాలీవుడ్‌కి తీసుకురావాలని చాలామంది నిర్మాతలు ప్రయత్నించారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ జాన్వీతో మాత్రం ‘ఓకే..’ చెప్పించలేకపోయారు. జాన్వీకి తెలుగు సినిమాలు చేయడం ఏమాత్రం ఇష్టం లేదన్న ఓ టాక్ కూడా నడిచింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన జాన్వీ దీనిపై స్పందించింది. తాను తెలుగులో నటించడానికి సిద్ధమే అని.. క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒకటే సమస్య. అదే.. పారితోషికం. ఒక్కో సినిమాకీ జాన్వీ కపూర్ రూ.2 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని టాక్. సమంత, రష్మికలతో సమానమైన పారితోషికం అది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే రూ.2 కోట్ల పారితోషికం అడిగితే.. నిర్మాతలు మాత్రం ఎందుకు ఒప్పుకొంటారు? పైగా జాన్వీకి బాలీవుడ్‌లోనూ అదిరిపోయే హిట్టేం లేదు. కేవలం శ్రీదేవి కూతురు అనే క్రేజ్‌తోనే తనని టాలీవుడ్‌కి తీసుకురావాలి. జాన్వీ తెలుగులో నటించడానికి సిద్ధంగానే ఉన్నా, పారితోషికం విషయంలో తగ్గకపోవడంతో తనని తెలుగు తెరపై చూసే అవకాశం రావడం లేదు. పారితోషికంలో కాస్త రిబేటు ఇచ్చినా… జాన్వీ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయినా తన టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైపోయినట్టే.