DailyDose

ఆగ్రా వాసిని పెళ్లాడిన బ్రిటీష్ యువతి

ఆగ్రా వాసిని పెళ్లాడిన బ్రిటీష్ యువతి

సోషల్ మీడియా భాష, జాతి, సరిహద్దులను చెరిపేస్తూ బ్రిటీష్ యువతికి, ఆగ్రా గ్రామ యువకుడికి మధ్య వారధిగా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా బ్రిటీష్ దేశానికి చెందిన యువతి హన్నా హెవిట్ ఆగ్రా జిల్లా గ్రామ యువకుడు పాలేంద్రసింగ్ ల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి వారి పెళ్లికి దారి తీసింది. ప్రేమకు జాతి, కులం,మతం, భాష, దేశ సరిహద్దులు లేవని నిరూపించేలా సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాజిల్లా బమ్రోలి కటారా గ్రామంలోని దేవాలయంలో హన్నా హెవిట్, పాలేంద్రసింగ్‌ల వివాహ వేడుక జరిగింది.

కరోనా సమయంలో ఏర్పడిన ఆన్‌లైన్ పరిచయం
ఆగ్రా జిల్లా బమ్రోలి కటారా గ్రామ యువకుడు పాలేంద్రసింగ్ ఆగ్రాలోని ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్ మేనేజరుగా పనిచేస్తున్నారు.ఇతను కొవిడ్ మొదటి వేవ్ సమయంలో సోషల్ మీడియాలో సోషల్ మీడియా వేదికగాపోడ్‌కాస్ట్‌ను ప్రారంభించాడు.యూకేలోని మాంచెస్టర్ నివాసి అయిన నర్సు హన్నా ఆ పోడ్‌కాస్ట్ ద్వారా పాలేంద్రసింగ్ తో పరిచయం ఏర్పడింది. వారు తమ ఇష్టాలు, అయిష్టాలు,వారి సంబంధిత సంస్కృతుల గురించి వాస్తవాలను చర్చించుకున్నారు. వీరిద్దరూ ఈమెయిల్, టెలిగ్రామ్ ఐడీలను ఒకరికి మరొకరు ఇచ్చుకున్నారు.సోషల్ మీడియా వేదికగా సాగిన వారి పరిచయం ప్రేమగా మారింది. అంతే కోవిడ్ సంక్షోభం ముగిసిన వెంటనే వివాహం చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.

వేదమంత్రాల సాక్షిగా ప్రేమ పెళ్లి
యూకే నుంచి హన్నా హెవిట్ తన ప్రియుడైన పాలేంద్రసింగ్ స్వగ్రామమైన బమ్రోలి కటారాకు వచ్చారు. సోమవారం స్థానిక దేవాలయంలో హిందూ సంప్రదాయ బద్ధంగా జరిగిన వివాహ వేడుకలో హన్నా, పాలేంద్రసింగ్‌లు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు.వివాహం అనంతరం తాను భారతీయ జీవనశైలితో పాటు హిందీ భాషను నేర్చుకుంటానని హన్నా చెప్పారు.హిందుస్థానీ బిరాదారీ వైస్ చైర్మన్ విశాల్ శర్మ మాట్లాడుతూ విదేశీయులు ఆగ్రా నివాసిని వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదన్నారు.చాలా మంది జంటలకు తాజ్ మహల్ నీడలో వివాహం చేసుకోవడం లక్ష్యం అయితే, హన్నా ఆగ్రా జిల్లా గ్రామంలోని ఆలయంలో వివాహం చేసుకోవడం విశేషం.