Movies

తట్టుకోవాలి కదా!

తట్టుకోవాలి కదా!

రోజులు కలిసి రాకున్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రయాణం ఆపకూడదు అని అంటున్నది స్టార్‌ హీరోయిన్‌ సమంత. ఇటీవల మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడిన సమంత ఆ రుగ్మతకు చికిత్స తీసుకుంటున్నది. ఆమె కొత్త సినిమా ‘యశోద’ ఈనెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సమ ంత..త్వరలోనే పబ్లిసిటీలో పాల్గొంటానని తాజాగా సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా తెలిపింది. ఆమె స్పందిస్తూ…‘కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. రోజులు బాగా లేకున్నా, విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటికి తట్టుకోవాలనే మాట ఒక మిత్రుడి ద్వారా తెలుసుకుని స్ఫూర్తి పొందా. నా కొత్త సినిమా ప్రచారంలో పాల్గొనబోతున్నా. థియేటర్లలో మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటా’ అని పేర్కొంది.