Devotional

శ్రీశైలంలో పెరిగిన రద్దీ – నేడు జ్వాలా తోరణం, లక్ష దీపోత్సవం – TNI ఆధ్యాత్మికం

శ్రీశైలంలో పెరిగిన రద్దీ  –  నేడు జ్వాలా తోరణం, లక్ష దీపోత్సవం – TNI  ఆధ్యాత్మికం

శ్రీశైలంలో పెరిగిన రద్దీ – నేడు జ్వాలా తోరణం, లక్ష దీపోత్సవం – TNI ఆధ్యాత్మికం
శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని శ్రీశైలానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాఢ వీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధనలను జరిపారు. దేవస్థానం అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచి నీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేశారు. అన్నదాన భవనంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు అన్నప్రసాద వితరణ, రాత్రి అల్పాహారం అందజేస్తున్నారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం కార్యక్రమం నిర్వహించారు. లోకకల్యాణార్థం స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
*మహానందిలో భక్తుల సందడి
మహానంది క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మహానందీశ్వరుడి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతిచ్చారు.

1. కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?
ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.
అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదుఇక. మొత్తం జనంతో నిండిపోతుంటారుంకొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలోంపడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు.అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా, మనం చేసే దుష్క్ర్తులను పొగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం. కాబట్టి ఆశ్వయుజమాసం చివర వచ్చిన తిధినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు.

2. చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఈ కారణంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టంచేసింది. మంగళవారం మఽధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం కారణంగా శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి చేశాక సర్వదర్శనాలను ప్రారంభిస్తారు.

3. శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని శ్రీశైలానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాఢ వీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధనలను జరిపారు. దేవస్థానం అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచి నీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేశారు. అన్నదాన భవనంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు అన్నప్రసాద వితరణ, రాత్రి అల్పాహారం అందజేస్తున్నారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం కార్యక్రమం నిర్వహించారు. లోకకల్యాణార్థం స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

4. మహానందిలో భక్తుల సందడి
మహానంది క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మహానందీశ్వరుడి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతిచ్చారు.

5. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నగదు, బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితర ఆస్తుల ద్వారా వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు.. విప్రో, నెస్లే, ఓఎన్జీసీ, ఐవోసీతో పాటు తదితర కంపెనీల మార్కెట్‌ ఆస్తుల కంటే ఎక్కువ. ఏడుకొండల స్వామికి బ్యాంకుల్లో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో రూ.16 వేల కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులు ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు వెల్లడించింది.

6. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక రెండవ సోమవారం సందడిగా మారింది. తెల్లవారుజాము నుండి వేయిస్తంబాల దేవాలయం (Thousand pillars temple)ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాళేశ్వరం దగ్గర గోదావరిలో పుణ్యస్నాలు ఆచరించి, భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. మంగపేట పుష్కరఘాట్‎లోనూ భక్తుల సందడి నెలకొంది.

7. తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 84,211 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి రూ.4.20 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 30,906 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

8. కార్తీక పౌర్ణమి సందర్భంగా వన్ టౌన్ పాత శివాలయంలో పరమేశ్వరున్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో పీఠాధిపతికి ఆలయ అర్చక స్వాములు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనాంతరం భ్రమరాంబ అమ్మవారిని, అయ్యప్ప స్వామిని స్వామీజీ దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులచేత వేద ఆశీర్వచనం పొందారు. వన్ టౌన్ పాత శివాలయం ఈవో హేమలత స్వామి వారి శేష వస్త్రాలను స్వామీజీకి అందించారు.

9. కార్తీక సోమవారం సందర్భంగా దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్‌లో భక్తులు కిక్కిరిశారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్న శివాలయాలు…
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్‌లో భక్తులు కిక్కిరిశారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్న శివాలయాలు… పంచారామ క్షేత్రాలు, శైవ క్షేత్రాలలో భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి 365 వత్తులు వెలిగించుకుంటున్నారు. ఉదయం నుంచి కృష్ణా నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలను భక్తులు నదిలో వదులుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం నిర్వహించారు. అమ్మవారి భక్తుల కోసం భవానీల కోసం ఈ రోజు నుంచి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు

10. బాపట్ల: జిల్లాలోని వేటపాలెం గంగాపార్వతి సమేత భోగలింగేశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం తెల్లవారుజామున గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలతో స్వామిని సూర్యభగవానుడు అభిషేకించారు. సుమారు 15 నిమిషాల పాటు స్వామిని కిరణాలు స్పృశించాయి. ఈ అపురూప దృశ్యాలను భక్తులు తిలకించి పరవశించిపోయారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో స్వామిని సూర్య కిరణాలు అభిషేకిస్తుడటం జరుగుతోంది.

11. చంద్రగ్రహణం కారణంగా రేపు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయం తలుపులు మూసివేయనున్న అర్చకులు… సాయంత్రం ఏడు గంటలకు ఆలయం తలుపులు తెరవనున్నారు. రేపు ఉదయం సుప్రభాత సేవ , ఖడ్గమాలార్చిన, గణపతి హోమము, నవగ్రహ శాంతి హోమము , రుద్ర హోమం యధావిధిగా నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం యధావిధిగా, దర్శనాలు అర్జిత సేవలు కొనసాగనున్నాయి.