NRI-NRT

భారత్‌లోనే ట్విట్టర్‌ కోతలు అధికం

భారత్‌లోనే ట్విట్టర్‌ కోతలు అధికం

ట్విట్టర్‌ ఉద్యోగాల కోత మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్కువగా ఉంది. ట్విట్టర్‌ తన చేతికి వచ్చిన వెంటనే మొత్తం 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని ఎలాన్‌ మస్క్‌…ట్విట్టర్‌ ఉద్యోగాల కోత మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్కువగా ఉంది. ట్విట్టర్‌ తన చేతికి వచ్చిన వెంటనే మొత్తం 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని ఎలాన్‌ మస్క్‌ ఇంటికి పంపించారు. భారత్‌లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగుల్లో 90 శాతం మందిని రోడ్డున పడేశారు. ఉన్న కొద్ది మంది ఉద్యోగులు కూడా ఎపుడు ఏ వార్త వినాల్సి వస్తుందా? అని బితుకు బితుకుమంటూ బతుకుతున్నారు. తర్వాతి తీసివేతల్లో తామూ ఉంటామని భయపడుతున్నారు.
*ఇది అన్యాయం : ఐటీ మంత్రి వైష్ణవ్‌
ట్విట్టర్‌ ఇండియా చర్యని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ త్రీవంగా తప్పు పట్టారు. ‘‘భారత్‌లో తన ఉద్యోగులను ట్విట్టర్‌ తొలగించిన తీరుని మేం ఖండిస్తున్నాం. ఇతర ఉద్యోగాల్లోకి మారేందుకు వారికి తగినంత సమయం ఇచ్చి ఉండాల్సింది’’ అన్నారు. రాబోయే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకే టెక్‌ కంపెనీలు ఇలా ముందు జాగ్రత్త పడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.