Business

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌- 2023 లోగోను ఆవిష్కరణ

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌- 2023 లోగోను ఆవిష్కరణ

 రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా ముందుకెళ్తున్న సంక్షేమ ప్రభుత్వం.. మరో అడుగేసింది. విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌- 2023 లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్‌ షన్‌మోహన్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమలుశాఖ సలహాదారు ఎల్‌ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్‌ ఎస్‌ నీరజ్, ఏపీఐడీసీ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.