Sports

విడిపోనున్న సానియామిర్జా దంపతులు

విడిపోనున్న సానియామిర్జా దంపతులు

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ జంట విడిపోనున్నారన్న వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు సమాచారం. సానియా-మాలిక్‌ల పెళ్లి 2010 ఏప్రిల్‌లో జరిగింది. 2018లో వీరికి ఓ బాబు జన్మించాడు.

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ జంట విడిపోనున్నారన్న వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు సమాచారం. సానియా-మాలిక్‌ల పెళ్లి 2010 ఏప్రిల్‌లో జరిగింది. 2018లో వీరికి ఓ బాబు జన్మించాడు. వివాహం అయినప్పటినుంచి సానియా, షోయబ్‌ దుబాయ్‌లో ఉంటున్నారు. గతంలో ఈ జోడీ దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన పామ్‌జుమేరా ఐలాండ్‌లోని విలాసవంతమైన విల్లాలో ఉండేవారు. కానీ కుమారుడి స్కూల్‌ కోసం దుబాయ్‌లోని మరో ప్రాంతంలో కొనుక్కున్న కొత్త ఇంట్లోకి కొద్దినెలల కిందటే సానియా మారింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు ఏమిటన్నది కచ్చితంగా తెలియకున్నా..పాక్‌కు చెందిన ఓ మోడల్‌తో షోయబ్‌ చేసిన హాట్‌ ఫొటోషూట్‌వల్లేనని అంటున్నారు. షోయబ్‌కు ఆ మోడల్‌తో బంధంపై కూడా చాలా పుకార్లే వచ్చాయి. అలాగే ఈ మధ్య షోయబ్‌ తన టీవీ షో ఒకదానిలో సానియా నిర్వహించే టెన్నిస్‌ అకాడమీల గురించి చెప్పాలని ఓ అభిమాని అడగ్గా..అసలు ఆమెకు ఎక్కడెక్కడ అకాడమీలున్నాయో తనకు సరిగా తెలియదని సమాధానమిచ్చాడు.

షోయబ్‌ జవాబుతో కంగుతిన్న వకార్‌ యూనిస్‌ ‘నువ్వేమి భర్తవయ్యా’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు ఇటీవల సానియా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ కూడా వారు విడిపోనున్నారన్న పుకార్లకు బలం చేకూర్చింది. ‘బద్దలైన హృదయాలు అల్లాను వెతుక్కుంటూ వెళతాయి’ అన్న ఆ పోస్ట్‌ సానియా, షోయబ్‌ మధ్య సంబంధాలు సక్రమంగా లేవన్న అనుమానాలను కలిగించింది. ఏమైనా ఇప్పుడు రెండు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న పుకార్లకు సానియా, షోయబ్‌ మాత్రమే తెరదించాల్సి ఉంటుంది