Movies

దిశా కాదు శ్రద్ధా

Auto Draft

సృజనాత్మక విబేధాలతో హీరోలు ప్రాజెక్ట్‌లు వదిలేయడం చూశాం కానీ బాలీవుడ్‌లో ఓ నాయిక ఇదే పని చేసింది. సినిమా సెట్స్‌ మీదకు వెళ్లాక కథను తెరకెక్కిస్తున్న తీరు బాగాలేదంటూ ‘కెటీనా’ అనే సినిమా నుంచి బయటకొచ్చింది దిశా పటానీ. లాక్‌ డౌన్‌ ముందు మొదలైన ఈ సినిమా రెండేళ్లు సందిగ్ధంలో ఉండిపోయింది. ప్రస్తుతం రీషూట్‌ మొదలుపెట్టినా…నిర్మాత ఏక్తా కపూర్‌తో దిశాకు క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయట. దాంతో దిశాను కాదని శ్రద్ధా కపూర్‌ను తీసుకునే ఆలోచన చేస్తున్నది నిర్మాత ఏక్తా. ఈ క్రమంలో తారా సుతారియాను కూడా మరో ఆప్షన్‌గా పెట్టుకుంది. ఈ సినిమా ఏక్తా కపూర్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్నది. ఆషిమా చిబ్బర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.