ScienceAndTech

చంద్ర గ్రహణమంటే ఏమిటి?

చంద్ర గ్రహణమంటే ఏమిటి?

సూర్యునికీ చంద్రునికీ మధ్య భూమి రావడంతో, భూమి నీడ చంద్రుని మీద పడి చంద్రుడు పాక్షికంగా కానీ, పూర్ణంగా కానీ కనిపించకపోవడం.సూర్య చంద్ర గ్రహణాలు శతాబ్దాలుగా నిర్ణీత సమయాలకు వస్తున్నాయి.ఈ భూమి మీ మనుషులు లేనప్పుడూ , అంటే మరో జాతి నుంచి రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించక‌ ముందు కూడా సూర్య గ్రహణాలు వచ్చాయి.సూర్యగ్రహణమైనా ,చంద్ర గ్రహణమైనా వస్తే వాటి వల్ల ఏ కీడూ లేదు.గ్రహణమంటే ఏమీ‌లేదు , ఇంటి నీడ బజార్లో పోయే మనుషుల మీద పడినట్లే.

దానికే, వారి జీవితాలు మారిపోతాయా?
అరిష్టాలు జరుగుతాయా?
మొర్రి పిల్లలు పుడతారా?
వచ్చే ఉద్యోగాలు పోతాయా?
గెలిచే వారు ఓడుతారా?

సూర్య చంద్ర గ్రహణాలు ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో ఏమీ తెలియని నాటి అజ్ఞానపు భయాలతో వచ్చిన విశ్వాసాలు అవన్నీ.
చంద్రుడి సైజు భూమి సైజులో మూడవ వంతు.సూర్యుడి సైజు భూమి సైజు కంటే లక్షల రెట్లు ఎక్కువ.అలాంటి సూర్యచంద్రులను మింగే వారు, వదిలే వారు ఎవరూ లేరు.ఒక గోళానికి మరో గోళం అడ్డు రావడం వల్లనే ఆ గ్రహణాలు.వాటికి గ్రహణాలు అని పేరుపెట్టడమే సరి కాదు.ఆనాటి భాష అది.అవి ఖగోళ వింతలు.వినోదం కొరకు వాటిని కళ్ళారా చూడవచ్చు, కడుపారా తిన వచ్చు,లేదా తాగ వచ్చు.
వచ్చే అరిష్టాలు, మొర్రిలు, నష్టాలు, దివాళాలు ఏవీ ఉండవు.