Devotional

నవంబరు 20 నుంచి తిరుచానూరు పద్మావతి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

నవంబరు 20 నుంచి తిరుచానూరు పద్మావతి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు  –  TNI ఆధ్యాత్మికం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను 8 రోజులపాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం నవంబరు 19న అంకురార్పణ చేపడతారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 15 న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం up జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా రెండేండ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
**వాహనసేవల వివరాలు :
20-11-2022 (ఆదివారం) ధ్వజారోహణం, చిన్నశేషవాహనం
21-11-2022 (సోమవారం) పెద్దశేషవాహనం, హంసవాహనం
22-11-2022 (మంగళవారం) ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం
23 -11-2022 (బుధవారం) కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం
24 -11-2022 (గురువారం) పల్లకీ ఉత్సవం, గజవాహనం
25-11-2022 (శుక్రవారం) సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం
26-11-2022 (శనివారం) సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
27-11-2022 (ఆదివారం) రథోత్సవం, అశ్వ వాహనం
28-11-2022 (సోమవారం) పంచమీతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలను చేపడుతారని ఆలయ పూజారులు తెలిపారు.

2. కన్నుల పండువగా ఒంగోలులో శ్రీనివాస కల్యాణం
ఒంగోలులో శ్రీనివాస కల్యాణ కన్నుల పండువగా జరిగింది. శ్రీనివాసుడి కల్యాణానికి టీటీడీ బోర్డు విస్తృతంగా ఏర్పాటు చేసింది. శ్రీనివాసుడి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగర శివారులో బుధవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో వేదిక ఆవరణం మార్మోగింది. భక్తులందరు శ్రీవారి కల్యాణాన్ని చూసేందుకు వేదిక ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.సాయంత్రం 6.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా కల్యాణం ఘట్టాలకు అనుగుణంగా పద్మశ్రీ డాక్టర్‌ శోభారాజ్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, అర్చక బృందం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో దాత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి దంపతులతో పాటు మంత్రి విడదల రజని, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీద మస్తాన్ రావు, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

3.అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి కల్యాణ మహోత్స వం బుధవారం సాయంత్రం ఒంగోలు నగరం వెంగ ముక్కలపాలెంరోడ్డులోని శ్రీకరి ఎంపైర్‌లో అంగరంగ వై భవంగా జరిగింది. ప్రత్యేక అలంకరణతో ఏర్పాటుచేసిన కల్యాణమండపంలో మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపా లు, తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకుల వేదమంత్రో చ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కొనసాగిన ఈ కల్యాణాన్ని చూడటానికి ఒంగోలు నగరంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి కల్యాణ మహోత్స వం బుధవారం సాయంత్రం ఒంగోలు నగరం వెంగ ముక్కలపాలెంరోడ్డులోని శ్రీకరి ఎంపైర్‌లో అంగరంగ వై భవంగా జరిగింది. ప్రత్యేక అలంకరణతో ఏర్పాటుచేసిన కల్యాణమండపంలో మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపా లు, తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకుల వేదమంత్రో చ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కొనసాగిన ఈ కల్యాణాన్ని చూడటానికి ఒంగోలు నగరంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు, బాలినేని ప్రణీత్‌రెడ్డి, కావ్య దంప తులు కల్యాణదాతలుగా వ్యవహరించారు. కల్యాణోత్స వం తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నిర్వహి ంచగా, దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితు లు యాజ్ఞీకంలో దాదాపు 40మంది అర్చకబృందం వైఖా నస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ క్రతువును జరిపించారు. ఈ సందర్భంగా కల్యాణమహోత్సవ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ముందుగా సాయంత్రం 6.30కు వేదపండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కళ్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కళ్యాణోత్సవం 8.30 గంటల వ రకు కొనసాగింది. అనంతరం స్వామివారికి అమ్మవార ్లకు నక్షత్రహారతి, మంగళహారతితో కార్యక్రమాన్ని దిగ్విజ యంగా ముగించారు. అనంతరం తిరుమల తిరుపతి దే వస్థాన అర్చకులు కల్యాణదాతలు బాలినేని శ్రీని వాస రెడ్డి, శచీదేవి, ప్రణీత్‌రెడ్డి, కావ్యదంపతులకు, వారి కుమా రునికి వేదోక్త ఆశీర్వచనాన్ని అందించి స్వామివారి అమ్మ వారి శేషవస్ర్తాలను, ప్రసాదాలను అందజేశారు. ప్ర ము ఖ సంగీత విద్వాంసురాలు డాక్టర్‌ శోభారాజ్‌, అన్న మా చార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూధన్‌రావు బృందం అన్నమయ్య సంకీర్తనలను గానం చేశారు. భక్తులందరి కీ కళ్యాణవేడుక స్పష్టంగా కనిపించేవిధంగా ప్రాంగణం నలుమూలలా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ఇక మహిళలకు చీర, పసుపుకుంకుమలను, హాజరైన ప్రతి ఒక్కరికీ స్వామి వారి లడ్డూ, వడ ప్రసాదాలను, తీ ర్థం, అక్షింతలను, అన్నమయ్య గళార్చన, భజగోవిందం ప ద్యాల పుస్తకాలను ఒక కిట్‌గా చేసి నిర్వాహకులు అందిం చారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది

4. కడలూరు జిల్లా చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయం ప్రభుత్వ స్థలంలో ఉందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్‌ బాబు(Minister Shekhar Babu) పేర్కొన్నారు. పైగా ఈ ఆలయాన్ని దీక్షితులు నిర్మించలేదని, రాజులు, పూర్వీకులు నిర్మించారని గుర్తుచేశారు. నగరంలోని కీల్పాక్కం, పూందమల్లి హైరోడ్డులో ఉన్న కాంచీపురం ఏకాంబరనాథర్‌ మెట్రిక్యులేషన్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన స్కూల్‌ భవనాలను పరిశీలించి తగిన మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడా మంత్రి మేయర్‌ ప్రియతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి శేఖర్‌ బాబు(Minister Shekhar Babu) విలేఖరులతో మాట్లాడుతూ… దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు రప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారని, ఆ దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, ఈ స్కూల్‌కు రూ.13 కోట్లతో 42 తరగతి గదులు కలిగిన అత్యాధునిక సౌకర్యాలతో భవనం నిర్మించనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా చిదంబరం నటరాజ స్వామి ఆలయాన్ని దీక్షితులు నిర్మించలేదన్నారు. రాజులు, ప్రజలను పాలించిన పూర్వీకులు నిర్మించారన్నారు. ఈ ఆలయ ఆదాయ ఖర్చుల వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత ఆలయ దీక్షితులకు ఉందన్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న లోటుపాట్లపై ప్రశ్నించి, వాటిని సరిచేసే కర్తవ్యం ప్రభుత్వానిదన్నారు. ఆలయ లోపల దీక్షితులు ఇష్టానుసారంగా భవనాలు నిర్మించారని, వీటి వివరాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు ఉందన్నారు. అదేవిధంగా ఈ ఆలయానికి రాజులు ఇచ్చిన ఆస్తులు, ఆభరణాల లెక్కలను సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఆలయ దీక్షితులకు ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా వారు హైకోర్టును ఆశ్రయిస్తామనడం భావ్యం కాదన్నారు. ఒక వేళ కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వం తరఫున అన్ని విషయాలను వెల్లడిస్తామని మంత్రి శేఖర్‌ బాబు తెలిపారు.

5. డిసెంబరు రూ.300 దర్శన టికెట్లు రేపు విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి డిసెంబరు నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ శుక్రవారం విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’లో ఈ కోటాను విడుదల చేసేందుకు టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ కోటా విడుదల కానుంది. భక్తులు తమకు కావాల్సిన తేదీ, స్లాట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

6. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 66,946 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,990 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.