DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

* జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. జనసేనాని విశాఖ పర్యటనపై తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పవన్ ప్రయత్నించారని ఆరోపించారు. విశాఖ పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

* పెదకూరపాడు నియోజకవర్గంలో మరో ఎస్టీ మహిళా సర్పంచ్‌కు వైసీపీ నేతల నుంచి వేదింపులు ఎదురవుతున్నాయి. అమరావతి సర్పంచ్‌గా ఎన్నికైన పాలపర్తి రాజేశ్వరి వైసీపీ నుంచి గెలుపొందారు. అయితే సర్పంచ్ స్దానంలో స్థానిక వైసీపీ నేతలు పెత్తనం సాగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్‌కే సీటు కేటాయించారని, తనపై ఉప సర్పంచ్ నిమ్మా విజయ సాగర్‌బాబు, వేములపల్లి నాగార్జున చౌదరిలు పెత్తనం చేస్తున్నారని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

* గ్రానైట్ వ్యాపారం చాలా చిన్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీంట్లో కేంద్రం, ఈడీ జోక్యం అవసరం లేదన్నారు. ఏం జరగకుండానే.. ఏదో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. కొండను తవ్వి చిట్టెలుకను పడుతున్నారని ఎద్దేవాచేశారు. దాడులు ఆపాలని, నష్టాల్లో ఉన్న పరిశ్రమను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. పారిపోయే వారికి సహాయం చేయడం కాదని, గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలన్నారు. తమకు క్లీన్ చీట్ రావడం ఖాయమని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.

* తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కాసాని బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ పుట్టిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. ‘చంద్రబాబు అంటే క్షమశిక్షణ… క్రమశిక్షణ అంటే చంద్రబాబు’ అని అన్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో అన్ని జిల్లాల యువత టీడీపీ జెండా పట్టుకున్నారని, తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ గ్రామన తిరుగుతానన్నారు.

*జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. జనసేనాని విశాఖ పర్యటనపై తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పవన్ ప్రయత్నించారని ఆరోపించారు. విశాఖ పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు..
*సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా గురవారం బాధ్యతలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్యవరప్రసాద్‌, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతిలు పాల్గొన్నారు. ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొమ్మినేని కొనసాగనున్నారు..

*కోయంబత్తూరు సిలిండర్‌ బ్లాస్ట్‌ కేసులో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని 45 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అనుమానితులు, వారికి సంహకరించిన వారి ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పుడుపెట్‌, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్‌మేడు, ఉక్కడం, పొన్విఝా నగర్‌, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

*జగన్‌ పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం జరుగుతోందని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌, ఆయన తనయుడు జగన్‌ రాయలసీమకి అన్యాయం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా రాయలసీమలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. వైసీపీ నాయకుల బెదిరింపులతో రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ పరిశ్రమ కూడా ఆగిపోయింది. సీఎం సొంత జిల్లా కడపలో స్టీల్‌ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి దాకా ప్రహరీని కూడా కట్టలేని దయనీయ పరిస్థితి. కుప్పం ప్రాంతానికి సాగునీరు అందించేందుకు టీడీపీ హయాంలో 95 శాతం పనులు పూర్తి చేశాం. వైసీపీ వచ్చాక మిగతా ఐదు శాతం పనులు కూడా చేయలేదు. రాజధానిపై ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ సీఎం జగన్‌ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అప్పట్లో రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నామని ప్రకటించిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి రాజధానిని మార్చేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం’’ అని అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు.

*జగన్‌రెడ్డి పాలనలో క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) క్రీడాకారుల పట్ల శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ‘‘పేద క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేసుకోవటానికి అందుబాటులో ఉన్న గ్రౌండ్స్‌ని శాప్‌ ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇవ్వడం దుర్మార్గం. వివిధ జిల్లాల్లో శాప్‌ ఆధ్వర్యంలోని 52 షటిల్‌ బ్యాడ్మింటన్‌, 10 టెన్నిస్‌ కోర్టులు, 4 స్కేటింగ్‌ రింక్‌లను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసి, పేద క్రీడాకారులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. ఈ ప్రక్రియ వల్ల క్రీడాకారులు ఫీజులు చెల్లించలేక క్రీడలకు దూరమై తద్వారా రాష్ట్రం క్రీడల్లో వెనుకబడే ప్రమాదం ఉంది. నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొన్న 300 మంది క్రీడాకారులకు చివరి నిమిషం వరకూ ఎటువంటి సాయం అందించకుండా వేధించారు. ఇప్పుడు ఏకంగా పేద క్రీడాకారుల జీవితాలతో గేమ్స్‌ ఆడుతున్నారు. శాప్‌లో అర్హత, క్రీడలకు సంబంధం లేని వారిని, వయస్సు మీరిన వారిని సలహాదారులుగా పెట్టుకుని, అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పోషించడానికి లేని అభ్యంతరం పేద క్రీడాకారుల విషయంలోనే ఎందుకు వస్తుంది?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.

*టీఆర్ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీస్‌పై ఈడీ (ED), ఐటీ (IT) దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని రవిచంద్ర ఆఫీస్‌లో సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 11 గంటలుగా ఈడీ, ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ (Hyderabad)తో పాటు కరీంనగర్‌ (Karimnagar)లోనూ ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి

*ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ (ED) దూసుకెళుతోంది. ఇప్పటి వరకూ డిల్లీ లిక్కర్ స్కాంలో టీడీపీ నేతల ప్రమేయం ఉందంటూ దుమ్మెత్తి పోసిన వైసీపీ నేతల (YCP Leaders)కు నేడు ఈడీ ఊహించని ఝలక్ ఇచ్చింది. నేడు ఈ కేసులో ఇద్దరు కీలక వ్యాపారులు అరెస్ట్‌ చేసింది. వారిలో ఒకరు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర బంధువు కావడం గమనార్హం. అంటే విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయానా అన్న అయిన పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే తెలంగాణ (Telangana)కు చెందిన వినయ్‌బాబును కూడా అరెస్ట్ చేసింది. కాగా.. శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌బాబులకు.. కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ వెల్లడించింది. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ గా ఉన్నారు.సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపునకు డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని 12కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను సీబీఐ (CBI) ఎఫ్‌ఐఆర్‌‌ (FIR)లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీ (EMD)లు చెల్లించారు.

*హైదరాబాద్‌ జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల పేర్లు తీసివేశారు. కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారు దాదాపు 60 వేలు ఉండగా దానికి సుమారు అయిదు రెట్లు తొలగించిన ఓటర్లున్నారు. జీహెచ్‌ఎంసీ బుధవారం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే డిసెంబరు 8వ తేదీలోపు తెలపాలని కోరింది. పోలింగ్‌ కేంద్రాలు, సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల వద్ద ఈ జాబితాను ప్రదర్శిస్తారు. 2023 జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. గతేడాది జాబితా ప్రకారం నగరంలో 43.67 లక్షల ఓటర్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 41.46 లక్షలకు తగ్గిం ది. నకిలీ ఓట్లు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో 29,591, యాకత్‌పురాలో 27,341, మలక్‌పేటలో 25,029, అత్యల్పంగా గోషామహల్‌లో 10,107, చార్మినార్‌లో 11,017 ఓట్లు తొలగించారు. కొత్తగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 59,775 ఉండగా అత్యధికంగా కార్వాన్‌లో 7,922, యాకత్‌పురాలో 7,503, అత్యల్పంగా కంటోన్మెంట్‌లో 908, సికింద్రాబాద్‌లో 1,716 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

*అన్నమయ్య జిల్లాములకలచెరువు ఎంపీడీవో సస్పెండ్. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన కారణంగా ఎంపీడీవో రమేష్ బాబును సస్పెండ్ చేసిన అన్నమయ్య జిల్లా జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీషా. ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు వహిస్తూ ఒక ఒక వ్యక్తి కి మాత్రమే మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కారణంగా మొలకలచెరువు ఎంపీడీవో రమేష్ బాబు ను విధులనుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్.

*తెనాలిలో గంజాయి మొక్క కలకలం.నందుల పేటలో కాళీ స్థలములో గంజాయి మొక్కను పెంచుతున్న ఓ యువకుడు.క్కకు వచ్చిన ఆకులు కోసి అరకేజి ఆకులు ఎండపెట్టిన యువకుడు .దాడి చేసి గంజాయి మొక్కను, అరకెజి గంజాయిని పట్టుకున్న పోలీసులు.గంజాయి మొక్కలు మరికొన్నీ చోట్ల పెంచుతునట్టు అనుమానం.నిండుతుడు గోపిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు అనుమానం.గత కొన్ని రోజుల నుంచి గంజాయిపై దాడులు చేస్తున్న పోలీసులు.

*సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా గురవారం బాధ్యతలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్యవరప్రసాద్‌, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతిలు పాల్గొన్నారు. ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొమ్మినేని కొనసాగనున్నారు..

*జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. జనసేనాని విశాఖ పర్యటనపై తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పవన్ ప్రయత్నించారని ఆరోపించారు. విశాఖ పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు..

*ఏపీలో సంచలనం రేపిన ఐదుగురు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. విద్యార్థులు అదృశ్యమై 24 గంటలు దాటిపోవస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న తిరుపతి పట్టణంలోని ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు పరీక్షలు అనంతరం కనిపించకుండా పోయారు. వీరిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు.

*తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్లోని 43వ డివిజన్లో రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు సంస్థ విచారణ కోసం హైదరాబాద్ రావాలని తనను పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

*పెదకూరపాడు నియోజకవర్గంలో మరో ఎస్టీ మహిళా సర్పంచ్‌కు వైసీపీ నేతల నుంచి వేదింపులు ఎదురవుతున్నాయి. అమరావతి సర్పంచ్‌గా ఎన్నికైన పాలపర్తి రాజేశ్వరి వైసీపీ నుంచి గెలుపొందారు. అయితే సర్పంచ్ స్దానంలో స్థానిక వైసీపీ నేతలు పెత్తనం సాగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్‌కే సీటు కేటాయించారని, తనపై ఉప సర్పంచ్ నిమ్మా విజయ సాగర్‌బాబు, వేములపల్లి నాగార్జున చౌదరిలు పెత్తనం చేస్తున్నారని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

*జగన్‌ పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం జరుగుతోందని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌, ఆయన తనయుడు జగన్‌ రాయలసీమకి అన్యాయం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా రాయలసీమలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. వైసీపీ నాయకుల బెదిరింపులతో రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ పరిశ్రమ కూడా ఆగిపోయింది. సీఎం సొంత జిల్లా కడపలో స్టీల్‌ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి దాకా ప్రహరీని కూడా కట్టలేని దయనీయ పరిస్థితి. కుప్పం ప్రాంతానికి సాగునీరు అందించేందుకు టీడీపీ హయాంలో 95 శాతం పనులు పూర్తి చేశాం. వైసీపీ వచ్చాక మిగతా ఐదు శాతం పనులు కూడా చేయలేదు. రాజధానిపై ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ సీఎం జగన్‌ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అప్పట్లో రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నామని ప్రకటించిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి రాజధానిని మార్చేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం’’ అని అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు.

*‘‘ఉద్యోగాలు ఇస్తానంటూ జగన్మోహన్‌రెడ్డి ఎన్నో ఆశలు కల్పించారు. గద్దెనెక్కాక హామీ నెరవేర్చలేదు. యువతను నిర్వీర్యం చేశారు. ప్రశ్నించేందుకు యూత్‌ కాంగ్రెస్‌ సమాయత్తం కావాలి’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. బుఽధవారమిక్కడ డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు అధ్యక్షతన యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జోనల్‌ ఇన్‌చార్జి గోపాలక్రిష్ణ షెడ్యూల్‌ను వివరించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలుంటే కేవలం 11 వేలే ఇచ్చి మోసం చేశారు. ప్రజలకు జగన్‌ మేనిఫెస్టోలోని అంశాలను, మోసాలను తెలిపేలా యువత ఉద్యమాలకు సిద్ధం కావాలి. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం మేలు చేశారని పర్యటనకు వస్తున్నారో చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

*మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ గోధుమలను తెచ్చి పిండిచేసి ప్యాకెట్లలో అమ్ముతున్న ప్రైవేట్‌ కంపెనీపై శంషాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడిచేశారు. బుధవారం రాత్రి గోదాంలో గోధుమల నిల్వలను గుర్తించారు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. చిలుకూరు సమీపంలోని వీఎన్‌జే ఆగ్రో ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో గోధుమ పిండిని ప్యాకెట్లలో నింపి విక్రయిస్తారు. శంషాబాద్‌ జోన్‌ ఎస్వోటీ పోలీసులు కంపెనీకి గోధు మలను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ సివిల్‌ స ప్లయీ్‌సకు చెందిన 300 గోధుమల బస్తాలను గుర్తించారు. అలా గే కంపెనీకి తీసుకెళ్లి అక్కడి గోదాంను తనిఖీ చేశారు. గోదాంలో మధ్యప్రదేశ్‌ సివిల్‌ సప్లయీస్‌ గోధుమల బస్తాల భారీగా గుర్తిం చారు. స్థానిక పోలీ్‌సలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఎస్‌వోటీ పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

*వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ) చీఫ్‌ అజయ్‌ సింగ్‌, ఐబీఏ అధ్యక్షుడు ఉమర్‌ క్రెమ్లెవ్‌ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈసారి టోర్నీ ఓవరాల్‌ ప్రైజ్‌మనీని రూ. 19.50 కోట్లకు పెంచారు. స్వర్ణ పతక విజేతకు రూ. 81 లక్షలు దక్కనున్నాయి. ఇక, ఈ మెగా ఈవెంట్‌ భారత్‌లో జరగడం ఇది మూడోసారి. గతంలో 2006, 2018లో ఇక్కడ నిర్వహించారు. అయితే, పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ మాత్రం ఇప్పటిదాకా భారత్‌లో జరగలేదు.

*తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కాసాని బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ పుట్టిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. ‘చంద్రబాబు అంటే క్షమశిక్షణ… క్రమశిక్షణ అంటే చంద్రబాబు’ అని అన్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో అన్ని జిల్లాల యువత టీడీపీ జెండా పట్టుకున్నారని, తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ గ్రామన తిరుగుతానన్నారు.

* గ్రానైట్ వ్యాపారం చాలా చిన్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీంట్లో కేంద్రం, ఈడీ జోక్యం అవసరం లేదన్నారు. ఏం జరగకుండానే.. ఏదో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. కొండను తవ్వి చిట్టెలుకను పడుతున్నారని ఎద్దేవాచేశారు. దాడులు ఆపాలని, నష్టాల్లో ఉన్న పరిశ్రమను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. పారిపోయే వారికి సహాయం చేయడం కాదని, గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలన్నారు. తమకు క్లీన్ చీట్ రావడం ఖాయమని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.

* కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని నాందేడ్‌లో కొనసాగుతోంది. ఆయన గురువారం మాట్లాడుతూ పార్లమెంటులో జరిగే సన్నివేశాలను వివరించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి రుచించని అంశాలపై ప్రతిపక్షాలు మాట్లాడితే, వెంటనే మైక్‌ను ఆపేస్తారన్నారు. తన చేతిలోని మైక్‌ను ఆన్/ఆఫ్ చేస్తూ పార్లమెంటులో పరిస్థితులను వివరించారు.

*కడపలో యోగి వేమన యూనివర్సిటీలోని విగ్రహ తొలగింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. యోగి వేమన పద్యంతోనే ఆయన వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడంటూ యోగి వేమన చెప్పిన పద్యంతో ట్విటర్ వేదికగా ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.

*‘జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎ్‌ఫడీబీ) సీఈవో డాక్టర్‌ సి.సువర్ణ ఇండియా అగ్రి బిజినెస్‌- 2022 అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. చేప పిల్లల ఉత్పత్తి, ఉత్పాదకతలో పెరుగుదల, మత్స్యకారుల జీవనోపాధి పెంపు, ఆక్వాకల్చర్‌లో జాతుల వైవిధ్యం తదితర అంశాల్లో విశేష కృషి చేసినందుకుగాను సువర్ణను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఆగ్రో వరల్డ్‌-2022లో దేశవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, ఆహార, ప్రజాపంపిణీ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేశారు.

*పపిల్లల టెండర్లలో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించిన నలుగురు కాంట్రాక్టర్లపై అనర్హత వేటు చేశామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తాజాగా తెలిపారు.

*లంగాణలో రాజకీయం రగులుతోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌.. సై అంటే సై అంటున్నాయి. రాజకీయ ఆఽధిపత్య పోరులో రాజ్యాంగ వ్యవస్థలను అస్త్రాలుగా వాడుకుంటు న్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీపై పైచేయి సాధించేందుకు యత్నిస్తున్న టీఆర్‌ఎస్‌.. తాజాగా మరింత దూకుడు పెంచి, సిట్‌ వేసింది. అటు కేంద్రం.. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ సహా పలువురు గ్రానైట్‌ వ్యాపారులపైకి ఈడీని సంధించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టి తన సందేహాలను నివృత్తి చేయాలన్న గవర్నర్‌.. తాజాగా తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో గవర్నర్‌ బీజేపీ ఏజెంటు అంటూ అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. ఇక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని రానుండడం కూడా రాజకీయ పోరుకు మరో వేదికగా మారింది. మోదీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్వీ ప్రకటించగా.. టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ విడుదల రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై సుప్రీం పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసింది. భీమా కోరెగావ్‌ కేసు నిందితుల కన్నా అవినీతిపరులే దేశాన్ని ధ్వంసం చేస్తారని వ్యాఖ్యానించింది.

*జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు దాఖలుచేసిన పిటిషన్‌ను జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు తిరస్కరించింది. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు సీసీఎల్‌ 5గా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే కేసులో తన ప్రమేయం లేదని, ఈ మేరకు జాబితా నుంచి తన పేరును తొలగించాలని బోర్డులో పిటిషన్‌ దాఖలుచేశాడు. కాగా… సంఘటన మొదటి నుంచి మిగతా నిందితులతో పిటిషనర్‌ కలిసి ఉన్నాడని, కారులో ప్రయాణించాడని, ఈ మేరకు సీసీటీవీ ఆధారాలు ఉన్నాయని పోలీసులు బోర్డుకు తెలిపారు.

*‘జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎ్‌ఫడీబీ) సీఈవో డాక్టర్‌ సి.సువర్ణ ఇండియా అగ్రి బిజినెస్‌- 2022 అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. చేప పిల్లల ఉత్పత్తి, ఉత్పాదకతలో పెరుగుదల, మత్స్యకారుల జీవనోపాధి పెంపు, ఆక్వాకల్చర్‌లో జాతుల వైవిధ్యం తదితర అంశాల్లో విశేష కృషి చేసినందుకుగాను సువర్ణను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఆగ్రో వరల్డ్‌-2022లో దేశవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, ఆహార, ప్రజాపంపిణీ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేశారు.

*ఉద్యోగాలు ఇస్తానంటూ జగన్మోహన్‌రెడ్డి ఎన్నో ఆశలు కల్పించారు. గద్దెనెక్కాక హామీ నెరవేర్చలేదు. యువతను నిర్వీర్యం చేశారు. ప్రశ్నించేందుకు యూత్‌ కాంగ్రెస్‌ సమాయత్తం కావాలి’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. బుఽధవారమిక్కడ డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు అధ్యక్షతన యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జోనల్‌ ఇన్‌చార్జి గోపాలక్రిష్ణ షెడ్యూల్‌ను వివరించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలుంటే కేవలం 11 వేలే ఇచ్చి మోసం చేశారు. ప్రజలకు జగన్‌ మేనిఫెస్టోలోని అంశాలను, మోసాలను తెలిపేలా యువత ఉద్యమాలకు సిద్ధం కావాలి. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం మేలు చేశారని పర్యటనకు వస్తున్నారో చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

*జగన్‌ పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం జరుగుతోందని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌, ఆయన తనయుడు జగన్‌ రాయలసీమకి అన్యాయం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా రాయలసీమలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. వైసీపీ నాయకుల బెదిరింపులతో రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ పరిశ్రమ కూడా ఆగిపోయింది. సీఎం సొంత జిల్లా కడపలో స్టీల్‌ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి దాకా ప్రహరీని కూడా కట్టలేని దయనీయ పరిస్థితి. కుప్పం ప్రాంతానికి సాగునీరు అందించేందుకు టీడీపీ హయాంలో 95 శాతం పనులు పూర్తి చేశాం. వైసీపీ వచ్చాక మిగతా ఐదు శాతం పనులు కూడా చేయలేదు. రాజధానిపై ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ సీఎం జగన్‌ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అప్పట్లో రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నామని ప్రకటించిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి రాజధానిని మార్చేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం’’ అని అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు.

*ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని వామపక్ష పార్టీలు తమ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చాయి. బుధవారం విజయవాడలో సీపీఐ (ఎంఎల్‌) రాష్ట్ర నేత జాస్తి కిశోర్‌బాబు అధ్యక్షతన జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో మోదీ పర్యటనపై చర్చించారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోన్న ప్రధానికి రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ప్రజాధనంతో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తుండటాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని కార్యక్రమాలకు లక్షలాదిగా జనసమీకరణ చేయడానికి జగన్‌ ప్రభుత్వం 7,000 మంది అధికారులు, ఉద్యోగులకు డ్యూటీలు వేసిందని రామకృష్ణ తెలిపారు. బీజేపీ నేతలతో పోటీ పడతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానికి స్వాగత ఏర్పాట్లు చేయడంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా జగన్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించి ప్రధానికి స్వాగత, సన్మానాలకు ఏర్పాట్లు చేయడమేంటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్‌, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర డిమాండ్లపై ప్రధాని నుంచి సమాధానం రాబట్టాలని డిమాండ్‌ చేశారు.

*హైదరాబాద్‌ స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌లో ఈ నెల 20న రైతునేస్తం అవార్డులు పంపిణీ చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు గ్రహీతల జాబితాను ఆయన విడుదల చేశారు. నాబార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులుకు జీవితసాఫల్య పురస్కారం, వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ టీ జానకీరాంకు కృషిరత్న అవార్డు, గుజరాత్‌కు చెందిన గోపాల్‌భాయ్‌ సుతారియాకు గోపాలరత్న అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే రైతు, శాస్త్రవేత్త, విస్తరణ విభాగాల వారీగా కూడా వివిధ జిల్లాల వారికి పురస్కారాలు అందజేయనున్నారు.

* ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలికల విద్యా ఉపకార వేతనాల పరీక్ష(జీఈఎ్‌సటీ)ను డిసెంబరు 4న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి చెప్పారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25మంది బాలికలకు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేయనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో మొదటి 10ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5వేలు, తర్వాత 15ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3వేలు చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసే వరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలంతా వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న బాలికలు ఎన్టీఆర్‌ వెబ్‌సైట్‌లో ఈనెల 11నుంచి 30వరకు పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 7660002627/28నంబర్లతో సంప్రదించాలని సూచించారు.

*భద్రతా పరికరాలు కొనుగోలు చేయడమే పాపమైందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు పేర్కొన్నారు. భద్రత- నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత ఏడాది మార్చి 18న తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ నిఘా విభాగాధిపతి ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.

* జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మళ్లీ సమన్లు జారీ చేసింది.జార్ఖండ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 17వతేదీన రాంచీలో(Ranchi) హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM) హేమంత్ సోరెన్‌కు(Hemant Soren) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.(ED issues fresh summons)47 ఏళ్ల సీఎం సోరెన్‌ను కేంద్ర ఏజెన్సీ ఈడీ మొదట నవంబర్ 3వతేదీన విచారణకు పిలిచింది. అయితే అధికారిక కార్యక్రమాలను ఉటంకిస్తూ సీఎం సోరెన్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత సమన్లను మూడు వారాలపాటు వాయిదా వేయాలని సోరెన్ కోరారు.

* కేరళలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి పలువిధాలుగా మోకాలడ్డుతున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు సీఎం విజయన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీ హోదాలో ఉన్న ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో ప్రముఖ విద్యావేత్తలను నియమించేలా ఆర్డినెన్స్‌ తేవాలనుకొంటున్నది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విజయన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. వైస్‌ చాన్స్‌లర్ల నియామకం, విశ్వవిద్యాలయాల పనితీరుకు సంబంధించి గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్య మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘రాజ్యాంగబద్ధమైన విధులకు అనుగుణంగా ఆయన నడుచుకుంటారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

* జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్‌ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్‌ సానుభూతిపరులను అరెస్టు చేశారు. నర్వాల్‌లోని జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఈక్రమంలో పెట్రోలింగ్‌ పార్టీ.. జమ్ముకశ్మీర్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ ట్యాంకర్‌ హైవేపై ఆగిఉండటాన్ని గమనించారు. దీంతో ట్యాంకర్‌ను అక్కడినుంచి తీయాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు కొద్ది దూరంలో ఉన్న నర్వాల్‌ సిద్రా బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న ఎన్విరాన్‌మెంటల్‌ పార్క్‌ వద్ద ట్యాంకర్‌ను నిలిపాడు. అయితే అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు మరోసారి ఆ లారీని అక్కడినుంచి తీయాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు ముందుకు వెళ్లకుండా యూటర్న్‌ తీసుకుని మొదట ఆపిఉంచిన ప్రాంతానికే వెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు.. డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతనితోపాటు ఉన్న ట్యాంకర్‌లో ఉన్న మరో ఇద్దరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

* ఖమ్మంలోని పలు ప్రైవేట్‌ దవాఖానల్లో బుధవారం ఇన్‌కం టాక్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 20 మంది మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని బాలాజీనగర్‌, వైరారోడ్‌లోని మూడు ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించారు.

* వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌నకు భారత్‌ ఆతిథ్యమివ్వబోతున్నది. న్యూఢిల్లీ వేదికగా మెగాటోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య(ఐబీఏ), బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ) మధ్య బుధవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. గతంలో పురుషుల ప్రపంచ టోర్నీ ఆతిథ్యాన్ని చేజార్చుకున్న భారత్‌..మహిళల చాంపియన్‌షిప్‌ నిర్వహించడం ఇది మూడోసారి. 75 నుంచి 100 దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొనే అవకాశమున్న టోర్నీలో ప్రైజ్‌మనీని రూ.19.50 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో స్వర్ణ పతక విజేతలకు రూ.81 లక్షలు దక్కనున్నాయి. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మాట్లాడుతూ ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తిరిగి నా టైటిల్‌ను నిలబెట్టుకుంటే వచ్చే డబ్బులతో ఇంటితో పాటు మెర్సిడెజ్‌ కారు కొంటాను. ఐబీఏ అధ్యక్షుడు క్రెమ్లెవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి కారులో షికారు చేస్తాం’ అని అంది. ఒకవేళ నిఖత్‌ ప్రపంచ టైటిల్‌ గెలిస్తే తానే కారు కొనిస్తానని క్రెమ్లెవ్‌ హామీ ఇచ్చారు.

* కేరళలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి పలువిధాలుగా మోకాలడ్డుతున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు సీఎం విజయన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీ హోదాలో ఉన్న ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో ప్రముఖ విద్యావేత్తలను నియమించేలా ఆర్డినెన్స్‌ తేవాలనుకొంటున్నది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విజయన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. వైస్‌ చాన్స్‌లర్ల నియామకం, విశ్వవిద్యాలయాల పనితీరుకు సంబంధించి గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్య మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘రాజ్యాంగబద్ధమైన విధులకు అనుగుణంగా ఆయన నడుచుకుంటారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

* భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు చేరవేసేలా హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘రాధాగోవిందుల’ రథ యాత్రను నిర్వహిస్తున్నామని అక్షయపాత్ర తెలుగు రాష్ర్టాల అధ్యక్షుడు శ్రీమాన్‌ సత్య గౌరచంద్ర దాస ప్రభూజీ తెలిపారు. బుధవారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నవంబర్‌ 12న హరేకృష్ణ మూవ్‌మెంట్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాధాగోవిందుల రథయాత్ర వివరాలను వెల్లడించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు దుర్గంచెరువు పార్కు నుంచి యాత్ర ప్రారంభమై అయ్యప్ప సొసైటీ, 100 ఫీట్ల రోడ్డు మీదుగా సైబర్‌ టవర్స్‌, శిల్పారామం, హైటెక్స్‌ కమాన్‌ వరకు సాగుతుందన్నారు. ఈ రథయాత్రను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, అక్షయపాత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ మధు పండిత్‌ దాస ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్సవ మూర్తులను బంజారాహిల్స్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ నుంచి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రథయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు