Movies

నాలుగేళ్ల తర్వాత..

నాలుగేళ్ల తర్వాత..

కరోనా సమయంలో కెరీర్‌ పరంగా బాగా దెబ్బతిన్న బాలీవుడ్‌ హీరోల్లో ఆయుష్మాన్‌ ఖురానా ఒకరు. తన సినిమాలేమీ ఆడకపోయినా, ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు. ఆర్టి్‌స్టగా పేరు వచ్చినప్పటికీ కమర్షియల్‌ బ్రేక్‌ రాలేదు. అందుకే ఈసారి పూర్తి యాక్షన్‌ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమా పేరే ‘యాన్‌ యాక్షన్‌ హీరో’ ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే .. మలైకా అరోరా ఐటెమ్‌ సాంగ్‌. కమర్షియల్‌గా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ఉండడం కోసం ఆయుష్మాన్‌ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. అందుకే ఈ స్పెషల్‌ సాంగ్‌.మలైకా ఐటెమ్‌ సాంగ్‌ అంటే మసాలాలు ఉంటాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకంజ వేయదని ఆమె చేసిన ఐటెమ్‌ సాంగ్స్‌ చూస్తే అర్థమై పోతుంది. 2018లో వచ్చిన ‘పతాక’ చిత్రంలో మలైకా ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఆ తర్వాత ఆమె ఎందుకో ఐటెమ్‌ సాంగ్స్‌ జోలికి పోలేదు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ‘యాన్‌ యాక్షన్‌ హీరో’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తోందన్నది ఆమె అభిమానులకు గుడ్‌ న్యూసే. కొత్త దర్శకుడు అనిరుధ్‌ అయ్యర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదల కానుంది.