DailyDose

క్యాన్సర్ల పనిపట్టే జన్యు సవరణ

క్యాన్సర్ల పనిపట్టే జన్యు సవరణ

క్యాన్సర్ల పనిపట్టే సరికొత్త జన్యు సవరణ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సవరించిన కొన్ని జన్యువులను రోగనిరోధక కణాల్లోకి పంపి క్యాన్సర్‌ కణాలపై పోరాడేలా చేశారు. గతంలో మనిషిలో కొన్ని జన్యువులను తొలగించి రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా చేశారు. కానీ, ఈ సారి జన్యువులను సవరించి, వాటిని రోగ నిరోధక కణాల్లో ప్రవేశపెట్టి, క్యాన్సర్‌ కణాల మ్యుటేషన్లను గుర్తించేలా చేశారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణ కణాలకు ఎలాంటి హాని జరుగదు. జన్యు సవరణకు శాస్త్రవేత్తలు క్రిస్పర్‌ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ కొత్త విధానాన్ని ఒక్కో రోగిలో ఒక్కో విధంగా ఉపయోగించాలని, రోగి సొంత రక్తాన్నే వాడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.