Business

భారత వృద్ధిరేటు 7 శాతమే !

భారత వృద్ధిరేటు 7 శాతమే !

ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలను మూడీస్‌ మరోమారు తగ్గించింది. 8.8 శాతం వృద్ధిరేటు లభిస్తుందని ఈ ఏడాది మే నెలలో అంచనా వేసిన మూడీస్‌..దానిని 7.7 శాతానికి సవరిస్తున్నట్లు సెప్టెంబరులో పేర్కొంది. తాజాగా దాన్ని 7 శాతానికి పరిమితం చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అంటే మే నాటి అంచనాలతో పోలిస్తే వృద్ధిరేటు అంచనాలను 1.8 శాతం మేర మూడీస్‌ తగ్గించినట్లయ్యింది. 2023లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి 4.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2024 కల్లా పుంజుకొని 6.4 శాతానికి చేరుతుందని తెలిపింది.కొవిడ్‌ పరిణామాల నుంచి కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడం వల్ల అవరోధాలు ఏర్పడొచ్చని మూడీస్‌ వివరించింది. ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అస్థిరత, సుదీర్ఘంగా కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలను కఠినతరం చేయడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్లలోని ఒడుదొడుకులు ప్రపంచ వృద్ధిరేటుకు సైతం విఘాతం కలిగించనున్నట్లు మూడీస్‌ పేర్కొంది..