ScienceAndTech

వేలంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండ‌ర్ ఆర్ట్‌ క‌లెక్ష‌న్‌కి రికార్డు ధ‌ర‌

వేలంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండ‌ర్ ఆర్ట్‌ క‌లెక్ష‌న్‌కి రికార్డు ధ‌ర‌

మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త పాల్ అల్లెన్ ఆర్ట్ క‌లెక్ష‌న్‌లోని చిత్ర‌ప‌టాలు వేలంలో రికార్డు ధ‌రకు అమ్ముడుపోయాయి. ఐదు పెయింటింగ్స్‌ ఒక బిలియ‌న్ డాల‌ర్ల ధర కంటే ఎక్కువ ప‌లికాయి. ఒక‌ ఆర్ట్ క‌లెక్ష‌న్‌లోనిపెయిటింగ్స్‌ వేలంలో ఇంత ధ‌రకు అమ్ముడుపోవ‌డం ఇదే మొద‌టిసారని ఈ వేలంపాట నిర్వ‌హించిన బ్రిట‌న్‌కు చెందిన‌ క్రిస్టీస్ అనే సంస్థ తెలిపింది. అల్లెన్ ఆర్ట్ క‌లెక్ష‌న్‌లోదాదాపు 60 అరుదైన పెయింటింగ్స్‌, శిల్పాలు ఉన్నాయి. వీటిలో ప్ర‌ముఖ చిత్ర‌కారులైన‌ వాన్ గాగ్‌, గాగిన్, సెజ‌న్నేగీసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయ‌ని క్రిస్టీస్ సంస్థ‌ చెప్పింది.150 పెయింటింగ్స్‌ని వేలం వేయ‌గా వాటిలో ఐదు రికార్డు స్థాయిలో వంద మిలియ‌న్ డాల‌ర్లు ప‌లికాయి. ఇదే వేలంలో గార్జెస్ సూర‌త్ అనే ఫ్రెంచ్ చిత్ర‌కారుడి 1888 నాటి పెయింటింగ్ ‘లెస్ పాసెస్, ఎన్‌సెంబుల్’ 149.2 మిలియ‌న్ డాల‌ర్ల ధ‌ర‌కు అమ్ముడుపోయింది.

చిన్న‌ప్ప‌టి స్నేహితుడితో క‌లిసి
పాల్ అల్లెన్ పూర్తి పేరు పాల్ గార్డ్‌న‌ర్ అల్లెన్. ఈయ‌న‌ అమెరికాలోని ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త‌ల్లో ఒక‌రు. అంతేకాదు కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్ కూడా. అల్లెన్, బిల్‌గేట్స్ ఇద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. దాంతో, ఇద్ద‌రూ క‌లిసి 1975లో ఏప్రిల్ 4వ తేదీన మైక్రోసాప్ట్ కంపెనీని మొద‌లుపెట్టారు. కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్‌, ఎల‌క్ట్రానిక్స్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు అమ్మాల‌నే ఉద్దేశంతో వీళ్లు మైక్రోసాఫ్ట్‌ని ప్రారంభించారు. పాల్ అల్లెన్ 2018లో చ‌నిపోయారు.