DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*జర్నలిస్ట్‌ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్‌డ్రైవ్‌ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్‌ డ్రైవ్‌ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు.ఈ సందర్భంగా రెహాన ప్రయత్నాన్ని సీఎం జగన్‌ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు..

*నారా లోకేష్ పాదయాత్రకు ముహుర్తం ఖరారు..,2023, జనవరి 27న కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం, చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగనున్న యాత్ర..,
ఏడాది పాటు జనం మధ్యే ఉండేవిధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం, యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగనున్న లోకేష్..!!.

*సామర్లకోట పట్టణంలో యథేచ్ఛగా గంజాయి వినియోగం…గంజాయి కి బానిసలవుతున్న యువత…
ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు.

*కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ 108 అడుగుల నాదప్రభు కెంపెగౌడ విగ్రహాన్ని ప్రారంభించారు. దీనికి ‘స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరటీ’గా నామకరణం చేశారు. బెంగళూరు నగర వ్యవస్థాపకుడు కెంపెగౌడ స్మారకంగా దీన్ని కెంపెగౌడ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. నిర్మాణానికి 98 టన్నుల రాగి, 120 టన్నుల స్టీల్ను ఉపయోగించారు. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించిన సంస్థే దీన్ని కూడా ఏర్పాటు చేసింది.

*కృష్ణాజిల్లా మచిలీపట్నం : బందరు మండలం గారాలదిబ్బ గ్రామంలో కుప్పకూలిన రామాలయం.
సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిన రామాలయం.ఆలయం పై భాగంలో ఉన్న స్లాబ్ మాత్రమే కుప్ప కూలాటంతో త్రుటిలో తప్పిన ప్రమాదం.స్లాబ్ కూలే సమయంలో ఆలయంలో నిద్రిస్తున్న గరాలదిబ్బ గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న బందర్ రూరల్ పోలీస్ సిబ్బంది.ఒక్కసారిగా పెచ్చులు ఊడి పడుతొండడంతో అప్రమత్తమై ఆలయంలో నుండి బయటకు పరుగులు తీసిన సిబ్బంది.సిబ్బంది బయటకు పరుగులు తీసిన ఐదు నిమిషాల్లో మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్ సిబ్బంది.గ్రామానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించిన రూరల్ సీఐ కొండయ్య, రూరల్ ఇన్చార్జి ఎస్ఐ నాగరాజు.

*మహారాష్ట్రలో ముంబైకి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఓ నిందితుడి ఆటకట్టించారు. నైరోబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులు అడ్డుకున్నారు.

*ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై తవనంపల్లె మండలం కాణిపట్నం గ్రామం వద్ద కారు పాల ట్యాంకర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి వెనుక నుంచి వచ్చి ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కాగా కారులో చిక్కుకుని నుజ్జునుజ్జైన మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

* కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. ఈ లేఖను వందేభారత్ రైలు చీఫ్‌ కమర్షియల్ మేనేజర్‌కు టీడీపీ నేతలు అందించారు. 3 రాష్ట్రాల కూడలిలో కుప్పం సెంటర్‌గా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. ద్రావిడ వర్సిటీ (Dravidian University), పీఈఎస్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు.. నిత్యం కర్ణాటక (Karnataka), తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, కుప్పంలో రైలు ఆగితే అందరికీ ఉపయోగమని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.

* రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బొర్లకుంట వెంకటేష్‌నేత అన్నా రు. కొండాపూర్‌లో దేవాదాయ శాఖ నిధులచే నిర్మి స్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి గురువారం ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావుతో కలిసి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రాష్ట్రంలో అన్ని కులమతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. వేంకటేశ్వర స్వామి పురాతన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గూడెం సత్యనారాయణస్వామి ఆల యాన్ని సందర్శించగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. స్వామి దర్శనం అనం తరం అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ లింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, ఏఎంసీ చైర్మన్‌ భూమేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగన్న, వైస్‌ ఎంపీపీ అనిల్‌, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఈవో శ్రీనివాస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

* ఎమ్మెల్యే కొనుగోలు కేసు (TRS MLAs case)లో ముగ్గురు నిందితులను పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్‌కు తరలించారు. రెండో రోజు కస్టడీలో భాగంగా నిందితుల వాయిస్‌ను రికార్డింగ్ చేయనున్నారు. ఎఫ్ఎస్ఎల్‌లో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్షలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో, వీడియోలలోని వాయిస్‌తో పోల్చి చూడనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది.

* కాళేశ్వరం అవినీతి పై విచారణ జరపాలని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నేడు పెద్దపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏమైనా కేసీఆర్ (CM KCR) అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. కాళేశ్వరం తో తెలంగాణకు లాభం లేదన్నారు. కాళేశ్వరం అవినీతిలో బీజేపీ (BJP)కి వాటా ఏమైనా ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. ప్రధాని మోదీ స్తే కలిసే దమ్ము లేదా అని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. టీటీడీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తెలంగాణకు ఎవరైనా రావొచ్చని.. ప్రజల మనసు గెలవొచ్చని షర్మిల పేర్కొన్నారు.

* తన విషయంలో ప్రొటోకాల్‌ ఎందుకు పాటించడం లేదో ప్రతీ ఒక్కరికీ తెలుసని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నవ్వుతూనే రాష్ట్ర ప్రభుత్వానికి చురకంటించారు. గురువారం ఆమె సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించి పటం వేయించారు. అనంతరం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు చెప్పారు. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరారని, దీనిపై కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడతానని తెలిపా రు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని కార్తీక మాసంలో దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

* జగన్ , విజయ సాయి రెడ్డి (తమ ఇంటి పేర్లు మార్చుకొని కుంభకోణాల రెడ్డి అని పెట్టుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… విజయ సాయి రెడ్డి కాదు… సారాయి రెడ్డి అని అన్నారు. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ విజయ సాయి రెడ్డి అల్లుడు, సోదరుడి పాత్ర ఉందని తెలిపారు. సజ్జల తాడేపల్లి గుమస్తా అని విమర్శించారు. ఇంత జరుగుతున్నా సజ్జల, విజయ సాయి రెడ్డి బుకాయిస్తున్నారన్నారు. మోదీపై వ్యక్తిగత విభేదాలు లేవని… మోదీ పర్యటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. వైసీపీ నేతల కుంభకోణాలపై ప్రధాని దృష్టి పెట్టాలని కోరారు. మోదీ సభకు మూడు రాజధానులకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారన్నారని బండారు సత్యనారాయణ తెలిపారు.

* ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛా ర్జి ప్రవీణ్రెాడ్డికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. ప్రవీణ్రె్డ్డితో పాటు మరో ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాలు ప్రొద్దుటూరులో బహిరంగ ప్రకటనలు చేయకూడదని షరతు విధించింది. నెల నుంచి ప్రవీణ్రె డ్డి, ఆరుగురు టీడీపీ కార్యకర్తలు కడప జైలులో ఉన్నారు. గతనెల 13న వైసీపీ – టీడీపీ వర్గాల రాళ్లదాడిలో ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

* రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టులో పీఎం మోదీ మీటింగ్ జరుగనుంది. మోదీ పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమాజిగూడా, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జుంక్షన్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాలను అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

* అమరావతి భూముల ( కోనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తదనంతర ప్రభుత్వాలు సమీక్షించవచ్చా? లేదా? అన్న అంశం చాలా పెద్దదని సుప్రీం తెలిపింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలని… అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరపున కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. అమరావతిలో అక్రమ భూములపై సీబీఐ చేత విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి తెలియజేశారు. సిట్ (SIT) ఏర్పాటు చేయడాన్ని పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారన్నారు. సీబీఐ చేతనే విచారణ కోరుతున్న ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సబబు కాదన్నారు. కాగా… సిట్‌కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(నియమ నిబంధనలు) చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ప్రతివాదుల తరపు న్యాయవాదులు వాదించారు.

* హైదరాబాద్‌: నగరంలోని బన్సీలాల్‌పేట మెట్లబావి పునరుద్ధరణ పనులను మరో 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈ నెలాఖరు లోపు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా మెట్లబావిని ప్రారంభిస్తామన్నారు. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో కలిసి మెట్లబావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.

* హైదరాబాద్‌ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్‌లోని మెట్రోస్టేషన్‌లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సుమారు అరగంటకుపైగా రైళ్లు నిలిచిపోవండంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పునరుద్ధరణ చర్యల అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

* దేశంలో విభ‌జ‌న బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయ‌కుండా ప్రేమ‌, సోద‌ర‌భావాన్ని పెంపొందించేలా యువ‌త చొర‌వ చూపాల‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. మ‌హారాష్ట్ర‌లోని నాంధేడ్‌లో భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ మీ జీవితంలో ఏ విష‌యానికైనా భ‌య‌ప‌డటం మానుకోవాల‌ని, భ‌యాన్ని హృద‌యాల నుంచి పార‌దోలి దేశం కోసం ప‌నిచేయాల‌ని యువ‌త‌ను కోరారు.

* విజయవాడ: నగరంలోని విద్యుత్సౌధా దగ్గర ఏపీ జెన్కో కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఫ్లాంట్ల నిర్మాణం కోసం ఇళ్లు, భూములు ఇచ్చి నష్టపోయామని నిర్వాసితులు వాపోయారు. నిర్వాసితుల ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఎండీని కలిసి సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.

* తాడేపల్లిగూడెం మండలం కడీయద్ద వద్ద బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. బాణాసంచా తయారీకి అన్నవరం అనే వ్యక్తి లైసెన్స్ తీసుకున్నారు. 15 కిలోల వరకు మాత్రమే ముడిసరుకు నిల్వకు అనుమతి ఇచ్చారు. అనుమతికి మించి వందల కిలోల ముడి సరుకును నిల్వ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులున్నారు.

* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు. నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ ఆందోళన చేపట్టారు. నల్లదుస్తులు ధరించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ… విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయమని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని రామకృష్ణ అన్నారు

* రాష్ట్రానికి గర్వకారణమైన నాడప్రభు కెంపేగౌడ 108 అడుగుల భారీ విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చే యడం ద్వారా అభివృద్ధికి స్ఫూర్తి కానుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. కెంపేగౌడ కాంస్యవిగ్రహాన్ని ప్రధాని నరేందమ్రోదీ ఆవిష్కరించనున్న నేపథ్యంలో గురువారం సభావేదికను, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన అనంతరం మీడియాతో మా ట్లాడారు. కెంపేగౌడ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్‌ సుతారాను ప్రధాని మోదీ అభినందించారన్నారు. అహ్మదాబాద్‌లోని వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతామూర్తిని, అంబేడ్కర్‌ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని రూపొందించిన ఖ్యాతి రామ్‌ సుతారాకు ఉందన్నారు. ఆయన చేతి నైపుణ్యంతోనే ఇంతటి చక్కటి విగ్రహం రూపొందించబడిందన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ఆయనను అభినందిస్తున్నట్టు తెలిపారు.

* మాజీ ఎమ్మెల్యే(Former MLA) యూబీ బణకార్‌ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవికి, వీరశైవ లింగాయత అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ పదవికి ఆయన రాజీనామా సమర్పించారు. ప్రజా జీవితంలో కొన్నిసార్లు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్న బణకార్‌ త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును అభిమానులతో కలసి చర్చించి ప్రకటిస్తానన్నారు. హావేరి జిల్లాకు సంబంధించినంతవరకు మంత్రి బీసీ పాటిల్‌, యూబీ బణకార్‌లను బీజేపీ జోడెద్దులుగా భావిస్తారు.

* భార్య మృతితో మానసిక వేదనకు గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం నెరేళ్ల గ్రామంలో కోడిముంజ ప్రశాంత్ భార్య ఇటీవల మృతి చెందింది. దీంతో భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక ప్రశాంత్‌(25) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

* ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలు ప్రజా, కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా రేపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని విశాఖకు రానున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్‌ పరిరక్షణ పోరాట సమితి నిరసనలకు పిలుపునిచ్చింది.

* ఎన్టీఆర్ జిల్లాఏ.కొండూరు మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో ఎమ్మార్వో గోగులోతు భద్రు నాయక్ ఇంట్లో ఏ.సి.బి సోదాలు పెనమలూరులో ఏ.సి.బి వలలో చిక్కిన ఎమ్మార్వో గోగులోతు భద్రు నాయక్పలు కీలక డాక్యుమెంట్లులను హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్న ఏ.సి.బి అధికారులు
దాడిలోఏ.సి.బి. సిఐ బి.నాగరాజుఏ.సి.బి కానిస్టేబుల్ దుంగం శ్రీనివాసరావు డి.యన్ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు

* ద్వారకాతిరుమలలో రెండు తలల పాము హల్‌చల్ చేసింది. కారులో ఓ వ్యక్తి స్థానిక వసంత నగర్‌కు వెళుతుండగా రెండు తలల పాము కంటబడింది. సదరు వ్యక్తి ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశారు. వారు చూస్తుండగానే రెండు తలల పాము పక్కనే ఉన్న పెద్ద రంద్రంలోకి వెళ్లిపోయింది. కాగా.. రెండు తలలో కనిపించడం చాలా అరుదు… అందులోనూ అంత పెద్ద రెండు తలల పాము కనిపించేసరికి స్థానికులు భయాందోళన చెందారు. అయితే అది విష సర్పం కాదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

* అనంతపురం: జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో పీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాలీ ట్రైనింగ్ సెంటర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కుట్టు మిషన్లు గార్మెంట్స్ పరిశ్రమ టీడీపీ నేత, పీజేఆర్ ట్రస్ట్ అధినేత పెరుమాళ్ళ జీవానంద రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ కోణంలోనే ఉపాధి నిస్తున్న ట్రైనింగ్ సెంటర్‌కు నిప్పు పెట్టారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడి ఉపాధి లేకుండా చేస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని పీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు

* పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కడీయద్ద వద్ద బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. బాణాసంచా తయారీకి అన్నవరం అనే వ్యక్తి లైసెన్స్ తీసుకున్నారు. 15 కిలోల వరకు మాత్రమే ముడిసరుకు నిల్వకు అనుమతి లభించింది. అయితే అనుమతికి మించి వందల కిలోల ముడి సరుకు నిల్వ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

* రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ దినోత్సవాన్ని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ మైనార్టీలు ఆందోళనకు దిగారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హజ్ కమిటీ రాష్ట్ర కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ రోడ్డులో మైనార్టీలు బైఠాయించి ధర్నాకు దిగారు. కాగా… నిరసన తెలువుతున్న మైనార్టీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ మైనార్టీలు నినాదాలు చేశారు. మైనార్టీల నిధులను, హక్కులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. మైనార్టీల సంక్షేమ పథకాలను జగన్ నిర్వీర్యం చేశారని టీడీపీ మైనార్టీలు మండిపడ్డారు.

* స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ నుండి వచ్చిన సందేశం ప్రకారం ఈనెల 11 నుండి 12 వరకు రుతు పవనాల ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నందున బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ కోస్తా తీర ప్రాంతాల ప్రజలు మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళ రాదని తిరుపతి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ : 0877-2236004 ఏర్పాటు చేసి 24 గంటలు పని చేసే విధంగా సిబ్బందికి డ్యూటీ లు వేశామని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.అన్ని లైన్ డిపార్ట్‌మెంట్లు జిల్లాలోని తీర ప్రాంత మండలాలు తడ, సూళ్లూరు పేట, వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారులు అందరు అందుబాటులో ఉండాలని అన్నారు. మానవ మరియు పశు ప్రాణ నష్టం ఇతర నష్టాలను నివారించడానికి పోలీస్, రవాణా, టెలికమ్యూనికేషన్స్, పవర్, వైద్య, డ్రింకింగ్ వాటర్, ఫైర్ శాఖ మొదలైన అత్యవసర సేవల అధికారులు ఎలాంటి సంఘటననైనా ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని 24గంటలు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూంలు మండలాల్లో ఏర్పాటు చేసుకుని విధులు సిబ్బందికి కేటాయించి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

* గన్నవరం పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య చెక్ పవర్ పై ఆంక్షలు విధిస్తూ డిపిఓ గురువారం ఆదేశాలు జారీ చేశారు. సర్పంచి చెక్ పవర్ ఎందుకు రద్దు చేయకూడదో పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

* రోజురోజుకీ వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా వైసీపీ నాయకులు ఎక్కడకక్కడ దాడులకు తెగబడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుకుంటలో ఓ వైసీపీ నాయకుడి ఆగడాలు మితిమిరాయి. ప్రభుత్వ స్థలంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌ను కబ్జా చేశాడు. అంతటితో ఆగకుండా అదే స్థలంలో దర్జాగా పందెం పుంజుల పెంపకాన్ని చేపట్టాడు. ఇదేంటని అడిగిన వారిపై దాడులకు తగబడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాడు. అయితే ఇంత జరుగుతున్నప్పటీ అధికారులు గానీ, అధికార పార్టీ నేతలు గాని పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)కి ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ (sake sailajanath) బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలని లేఖలో ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రధాని మోదీ అటకెక్కించారని అన్నారు. విభజన హమీలు విస్మరించి ఏపీకి నిధులివ్వకుండా వెనక్కి నెట్టిన ఘనత మోదీకే దక్కుతుందని తెలిపారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయాన్ని ప్రజలు మరిచిపోరని సాకే శైలజానాథ్ లేఖలో పేర్కొన్నారు.

* పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం మండలం గవరంపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam srinivasulu) వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ… పార్టీలో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని అన్నారు. పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ గుర్తింపు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటానని అన్నారు.

* మూడు డంపింగ్ సైట్లను క్లియర్ చేస్తామని, అవినీతి రహితంగా ఎంసీడీని తీర్చిదిద్దుతామని, ఎంసీడీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా వేతనాలు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. 10 హామీలతో కూడిన పత్రాన్ని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా హాజరయ్యారు. ఎంసీడీని 15 ఏళ్ల పాటు పాలించిన బీజేపీ తమ హయాంలో చేసిందేమీ లేదని, ఆప్ మాత్రం ఇచ్చిన హామీలకు ఎప్పుడూ కట్టుబడే ఉంటుందని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు మించి రావని జోస్యం చెప్పారు. ఢిల్లీని నడిపే వాళ్లకే ప్రజలు ఓట్లు వేయాలని, అభివృద్ధిని అడ్డుకునే వారికి కాదని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

*ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో.. చోటుచేసుకుంటున్న పరిణామాలపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. గ్రానైట్‌ కేసులకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసాలు, సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం వీరిద్దరినీ సీఎం హుటాహుటిన ప్రగతిభవన్‌కు పిలిపించారు. చాలాసేపు మాట్లాడారు. ఈ దాడులకు కౌంటర్‌గా ఏం చేయాలన్న దానిపై చర్చించారు. కాగా, ఈ చర్చల్లో కొందరు మంత్రులు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.*

* ఉప్పల్‌ భగాయత్‌లో అనుమతుల జారీ అధికారం జీహెచ్‌ఎంసీకి బదలాయించారు. టీఎ్‌సబీపాస్‌ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన అనంతరం అక్కడి లే అవుట్లలో భవన నిర్మాణాలకు బల్దియా అనుమతి ఇస్తోంది. 2005లో ఉప్పల్‌ భగాయత్‌లో రైతుల నుంచి హెచ్‌ఎండీఏ 733 ఎకరాలను సేకరించింది. ఇందులో హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌)కు 143 ఎకరాలు, వాటర్‌బోర్డుకు 100 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమిలో మొదటి విడతగా 413 ఎకరాలను హెచ్‌ఎండీఏ లే అవుట్‌గా అభివృద్ధి చేసింది. వేలంలో దాదాపు ప్లాట్ల విక్రయం పూర్తయ్యింది. అనంతరం అక్కడి ప్లాట్లలో భవన నిర్మాణాలూ మొదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ.. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్‌ కావడంతో ఆ సంస్థనే అనుమతులు జారీ చేస్తుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అనుమతుల రుసుమును మూసీ అభివృద్ధికి వినియోగించాలని ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(డీపీఎంఎస్‌) అమలులో ఉన్న సమయంలో హెచ్‌ఎండీఏ అనుమతులు మంజూరు చేసింది. టీఎ్‌సబీపాస్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో.. డీపీఎంఎ్‌సను కొన్నాళ్లుగా నిలిపి వేశారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో నిర్మాణ అనుమతుల జారీని జీహెచ్‌ఎంసీకి బదలాయించినట్లు ఓ అధికారి తెలిపారు.

*ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీ లాండరింగ్‌ కోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అరబిందో ఫార్మా, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థల డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డిని గురువారం ఢిల్లీలో అరెస్టు చేసింది. ఆయనతోపాటు ఈ కేసుతో సంబంధమున్న మద్యం వ్యాపారి, ఫ్రెంచి మద్యం కంపెనీ పెర్నాడ్‌ రికార్డ్‌ ఢిల్లీ రీజినల్‌ హెడ్‌ వినయ్‌బాబును కూడా అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు కొన్ని గంటలపాటు వారిద్దరినీ విచారించిన ఈడీ.. అనంతరం పీఎంఎల్‌ఏ చట్టం కింద అరెస్టు చేసింది. శరత్‌ చంద్రా రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బంధువు మాత్రమే కాకుండా ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఇక, అరెస్టు తర్వాత శరత్‌ చంద్రా రెడ్డి, వినయ్‌ బాబులను గురువారం మధ్యాహ్నం రౌజ్‌ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 7 రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి రోజు కొద్ది సమయం శరత్‌ చంద్రా రెడ్డి తన సతీమణిని కలుసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.

*అమెరికాలో మేరీల్యాండ్‌ గవర్నర్‌గా ఎన్నికైన తెలుగు మహిళ అరుణా మిల్లర్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభినందనలు తెలిపారు. గురువారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘మేరీల్యాండ్‌ మొదటి భారతీయ అమెరికన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు బిడ్డ అరుణా మిల్లర్‌ చరిత్ర సృష్టించినందుకు చాలా సంతోషిస్తున్నా. యూఎ్‌సలో ఈ కీలక పదవికి ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళ ఆమె’’ అని బాబు ట్వీట్‌ చేశారు.

*గడప గడపకు కార్యక్రమంలో జగనన్న ఇళ్ల నిర్మాణంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుని ఓ మహిళ నిలదీసింది. అక్కడ ఆయన మౌనంగా ముందుకు వెళ్లిపోవడంతో అంతా సద్దుమణిగిందనే అందరూ అనుకున్నారు. అయితే ఆ మరుసటి రోజు ఆమెపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. దీంతో ఆమె అవాక్కయ్యారు. బుధవారం ఉదయం విజయవాడ 47వ డివిజన్‌ కాశీపతి వీధిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళ రాళ్లపూడి సుజాత జగనన్న ఇళ్లపై వెలంపల్లిని ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వ అధికారులు మమ్మల్నే ఇళ్లు కట్టుకోమంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు కట్టిస్తుందన్న ప్రచారంలో అర్థం ఏముం ది?’’అని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే మౌనంగా ముందుకు వెళ్లిపోయా రు. ఈ విషయం అంతటితో ముగిసిపోయిందనే అంతా అనుకున్నారు. అయితే గురువారం ఉదయం 47వ డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ గోదావరి గంగ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

*విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీలో యూజీసీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. ఖాళీలను వీలైనంత త్వరగా.. పూర్తి పారదర్శకతతో, నిష్పాక్షికంగా భర్తీ చేయాలని, అర్హతల ఆధారంగా నియామకాలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. యూనివర్సిటీల నియామక బోర్డు బిల్లుపై గవర్నర్‌ వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేయడం కోసం మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి వెంట రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ తదితరులు ఉన్నారు.

*ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో.. చోటుచేసుకుంటున్న పరిణామాలపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. గ్రానైట్‌ కేసులకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసాలు, సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం వీరిద్దరినీ సీఎం హుటాహుటిన ప్రగతిభవన్‌కు పిలిపించారు. చాలాసేపు మాట్లాడారు. ఈ దాడులకు కౌంటర్‌గా ఏం చేయాలన్న దానిపై చర్చించారు. కాగా, ఈ చర్చల్లో కొందరు మంత్రులు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
*సీఎంఓ కనుసన్నల్లోనే ఫోన్‌ట్యాపింగ్‌ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వి.ఎ్‌స.ఎ్‌స. ప్రభాకర్‌ ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌ అవుతున్నాయని టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో వాపోతున్నారని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను సీఎం కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని, పోలీసు వ్యవస్థను రాజకీయమయం చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే గవర్నర్‌ ఫోన్లు ట్యాపింగ్‌ చేసి ఉంటారని ఆరోపించారు. ఈఎ్‌సఐ స్కాం, డ్రగ్స్‌, నయీం కేసు విషయంలో సిట్‌ ఏమైందని, మియాపూర్‌ భూ కుంభకోణంపై విచారణ ఏమైందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

*నిజాం కాలేజీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండు రోజులుగా యూజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గురువారం కూడా విద్యార్థులు తరగతులకు హాజరవ్వకుండా ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలిచ్చినా విద్యార్థులతో నామమాత్రంగానే చర్చలు జరిగాయి. కాలేజీలోని హాస్టల్‌లో గదులన్నీ విద్యార్థులందరికీ కేటాయించాలనే విద్యార్థుల ప్రతిపాదనను తిరస్కరించడంతో భవిష్యత్తు కార్యాచరణ చేపట్టేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. గురువారం ఇంటర్‌బోర్డు కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ నిజాం కాలేజీకి చెందిన పది మంది విద్యార్థులతో చర్చలు జరిపారు. యూజీ, పీజీ విద్యార్థులకు సమానంగా హాస్టళ్లు కేటాయిస్తామని అధికారులు వెల్లడించగా, దీనికి యూజీ విద్యార్థులు అంగీకరించలేదు. యూజీ విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్‌లో గదులన్నీ తమకే కేటాయించాలని విద్యార్థులు కోరగా అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్‌ కోసం తాము పోరాడుతున్నామని, కేసులు పెట్టినా పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

*సీఎంఓ కనుసన్నల్లోనే ఫోన్‌ట్యాపింగ్‌ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వి.ఎ్‌స.ఎ్‌స. ప్రభాకర్‌ ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌ అవుతున్నాయని టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో వాపోతున్నారని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను సీఎం కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని, పోలీసు వ్యవస్థను రాజకీయమయం చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే గవర్నర్‌ ఫోన్లు ట్యాపింగ్‌ చేసి ఉంటారని ఆరోపించారు. ఈఎ్‌సఐ స్కాం, డ్రగ్స్‌, నయీం కేసు విషయంలో సిట్‌ ఏమైందని, మియాపూర్‌ భూ కుంభకోణంపై విచారణ ఏమైందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

*మహారాష్ట్రలోని ముంబయి-గోవా జాతీయ రహదారిపై నది వంతెన వద్ద పేలుడు పదార్థాలు లభించడం కలకలం రేపింది. (Maharashtra)ముంబయి-గోవా జాతీయ రహదారిపై ఉన్న రాయగడ్ జిల్లాలో(Raigad District) భగవతి నది (Bhogavati River)వంతెనపై ఆరు జిలటిన్లతో కూడిన రెండు పేలుడు పదార్థాల బంచ్ లను(Explosive Device) పోలీసులు కనుగొన్నారు. జిలటిన్ స్టిక్స్ బంచ్ లకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అమర్చి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

*గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ సహా 38 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ షాక్‌ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీరిని పోటీ నుంచి తప్పించింది. మొత్తం 182 సీట్లు ఉండగా, తొలిజాబితాలో 160 నియోజకవర్గాల అభ్యర్థులను కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకే ఆయా స్థానాల్లో కొత్త ముఖాలను బరిలోకి దించుతున్నట్టు భావిస్తున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో 69 మందికి టికెట్లు దక్కాయి. పటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌తోపాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన మరో ఏడుగురికీ ఈ సారి బీజేపీ టికెట్లు దక్కాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన హార్దిక్‌ పటేల్‌ ఈ ఏడాది మేలో కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరారు. 77 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో సుమారు 20 మంది ఈ ఐదేళ్లలో బీజేపీలో చే రారు. వారిలో చాలామందికి తొలిజాబితాలో టికెట్లు దక్కాయి. రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన రాజేంద్ర సిన్హ్‌ రత్వాకూ టికెట్‌ దక్కింది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన ఓబీసీ నేత అల్పేశ్‌ ఠాకూర్‌, తాజాగా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన భవేశ్‌ కటారాల అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తొలివిడతలో డిసెంబరు 1న 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనుండగా, వా టిలో 84 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మలివిడతలో డిసెంబరు 5న 93 సీట్లకు ఎన్నికలు జరగనుండగా, 76 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

* ఒడిశాలో ఏనుగులు మద్యాన్ని తాగి గాఢ నిద్రలోకి వెళ్లిన ఘటన వెలుగుచూసింది. కియోంజర్‌ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు. అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో నాటు సారాను తయారు చేయడానికి ప్రయత్నించారు. తొలుత వాటిని నానబెట్టి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు మంగళవారం తిరిగి అడవిలోకి వెళ్లారు. అయితే నానబెట్టి ఉన్న కుండలు పగిలిపోయి ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతదూరం వెళ్లి చూస్తే 24 ఏనుగులు గాఢ నిద్రలో ఉన్నాయి. కుండల్లోని నానబెట్టిన నీటిని ఏనుగులు తాగాయని నిర్ధరించుకున్న గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్లు వచ్చి భారీ శబ్ధం చేయడంతో ఏనుగులు లేచి వెళ్లిపోయాయి.

* తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో- ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(విజయ డెయిరీ) చైర్మన్‌గా సోమా భరత్‌ కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

* మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూసుకుంట్లచే ప్రమా ణం చేయించారు.

* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద వద్ద మందు గుండు సామాగ్రి భారీ విస్ఫోటనం అన్నవరం అనే వ్యక్తికి సంబంధించిన సామాగ్రి గొడౌన్ గా గుర్తింపు ఐదుగురు దుర్మరణం సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ రెవిన్యూ పోలీస్ సిబ్బంది స్థానికులు పదిమందికి పైగా తీవ్ర గాయాలు గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమం