Fashion

మహిళలు విద్యారంగంలో మరింతగా రాణించాలి : గవర్నర్ హరి చందన్

మహిళలు విద్యారంగంలో మరింతగా రాణించాలి : గవర్నర్ హరి చందన్

తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..ఉన్నత విద్యా విధానంలో భారతదేశం ప్రపంచలోనే రెండోస్థానంలో ఉందన్నారు. కోవిడ్ కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధనపద్ధతి అమల్లోకి వచ్చిందని చెబుతూ.. భవిష్యత్తులో బోధన-అభ్యాస ప్రక్రియకు అనుగుణంగా కోర్సు కంటెంట్‌ను పునఃరూపకల్పన చేయాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళలు పూర్తి ఉత్సాహంతో ఉన్నత విద్యారంగంలో రాణిస్తున్నారని, భారతదేశ తాజా జాతీయ విద్యా విధానం లింగ సమానత్వాన్ని చాటుతోందని గవర్నర్ పేర్కొన్నారు.