DailyDose

డల్లాస్‌ ఎయిర్‌ షోలో అపశృతి

డల్లాస్‌ ఎయిర్‌ షోలో అపశృతి

అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్‌ షోలో అపశృతి చోటుచేసుకున్నది. రెండు బాంబర్‌ విమానాలు ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బోయింగ్‌ బీ-17 బాంబర్‌ విమానం గాలిలోకి ఎగిరి భూమికి కొంత ఎత్తులో ప్రయాణిస్తున్నది.
Boeing
ఇంతలో బెల్‌ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్‌ విమానం దానిని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు క్షణాల్లోనే కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు యుద్ధవిమానాల్లో ఉన్న ఆరుగురు మరణిచారని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) విచారణకు ఆదేశించాయి.