Movies

వాళ్లలా కాదు

వాళ్లలా కాదు

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌, రిచా చద్దా లాంటి తారల తర్వాత ఓపెన్‌ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చే నాయికగా రాధికా ఆప్టేకు పేరుంది. వీళ్ల మాటలు చాలాసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కొందరు అందం కోసం శస్త్రచికిత్సలను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది రాధికా ఆప్టే. అందం కోసం చాలా మంది బాలీవుడ్‌ తారల్లా తాను సర్జరీలు చేయించుకోలేదని, అలా చేసుంటే తనకూ మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవని ఆమె చెప్పింది.రాధికా ఆప్టే మాట్లాడుతూ…‘సినిమాల్లో అందమైన యువతులనే హీరోయిన్‌లుగా తీసుకుంటారు. నువ్వు ఫలానా సినిమాలో అలా నటించావు, ఆమె మాత్రం తెరపై ఇలా కనిపించింది అంటూ సాకులు చెబుతారు. అందంగా ఉన్నారనే కారణంతో నాకొచ్చిన అవకాశాలను కొందరు హీరోయిన్లు ఎగరేసుకుపోయారు. నేను వాళ్లలా సౌందర్యం కోసం సర్జరీలు చేయించుకోలేదు. ఆ దారిలో అందాన్ని పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ మధ్య పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తున్నది. అన్ని వయసుల తారలకూ ఎండార్స్‌మెంట్స్‌ చేసే అవకాశాలు వస్తున్నాయి. వారికి ఇదొక ఉపశమనం’ అని చెప్పింది. రాధికా ఆప్టే నటించిన తాజా చిత్రం ‘మోనికా ఓ మై డార్లింగ్‌’ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నది.