Politics

విశాఖలో ఐదు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

విశాఖలో ఐదు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

విశాఖపట్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా విశాఖ ఏయూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.10 వేల కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. రూ.7,614 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పాతపట్నం – నరసన్నపేట మధ్య రెండు లైన్ల రహదారి, తూర్పు తీరంలో ఓఎన్‌జీసీ యూ ఫీల్డ్‌ అభివృద్ధి, గుంతకల్లులో ఐవోసీఎల్ చేపడుతున్న గ్రాస్‌ రూట్‌ డిపోలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు. విద్యుదీకరణ, డబ్లింగ్‌ రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు.
Whats-App-Image-2022-11-12-at-5-14-16-PM
*అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదు: మోదీ
అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. నేడు హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టు లో కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. తెలంగాణ లో అవినీతి రహిత పాలన అందించేందుకు సిద్ధమన్నారు. పేదలను దోచుకునేవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాలన్నారు. కేబినెట్‌లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో.. మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలన్నారు.22 ఏళ్లుగా ఎందరితోనో ఎన్నో తిట్లు తిన్నాను.. రోజు కిలోల కొద్దీ తిట్లు తింటాను.. అందుకే అలసిపోనన్నారు. మోదీని తిట్టేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చక్కగా తిట్లు వింటూ.. చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలన్నారు. తెలంగాణ సర్కార్‌కు రోజూ మోదీని తిట్టేందుకే సమయం సరిపోతోందన్నారు. మీరెన్ని తిట్లు తిట్టినా వాటిని అరిగించుకునే శక్తి తమలో ఉందన్నారు. తెలంగాణ సమాజాన్ని తిడితే మాత్రం అంతకంతా ప్రతీకారం తప్పదని మోదీ పేర్కొన్నారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవన్నారు. కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామన్నారు. రైతుల ఖాతాల్లోనే పీఎం కిసాన్ నిధులు వేస్తామన్నారు. నిధులు నేరుగా లబ్ధిదారులకే ఇస్తుండడంతో.. అవినీతిపరులకు కడుపు మండుతోందని ప్రధాని మోదీ అన్నారు.
Whats-App-Image-2022-11-12-at-5-14-14-PM-2
** తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం నగరానికి వచ్చిన మోదీ తెలంగాణ బీజేపీ సభ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ని జాతికి అంకితం చేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో కార్యకర్తలతో మాట్లాడాలని సంజయ్ కోరారని… ‘‘నేను కూడా మీలానే బీజేపీకి చెందిన చిన్న కార్యకర్తను’’ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ కార్యకర్తలను చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. పీపుల్స్ ఫస్ట్.. అనేది బీజేపీ నినాదమన్నారు. ఇక్కడి కార్యకర్తలను బలమైన శక్తులు.. ఎవరికీ భయపడరని అన్నారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు పదవులు అనుభవిస్తున్నారని… ప్రజలకు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రధాని విమర్శించారు.
Whats-App-Image-2022-11-12-at-5-14-14-PM-1
అడిగినా మోదీ స్పందించలేదట..
విశాఖ సభలో ఏపీ సమస్యలపై ప్రధాని మోదీ పెదవి విప్పలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్ ఊసే ప్రధాని ఎత్తలేదు. విశాఖ సభలో ఏపీ సమస్యలపై ప్రధాని మోదీ పెదవి విప్పలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్ఊసే ప్రధాని ఎత్తలేదు. ప్రధాని ప్రసంగంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం జగన్ కావాలనే తెలుగులో మాట్లాడారని జోకులు వేస్తున్నారు. జగన్ అడిగినా మోదీ స్పందించలేదనే చెప్పుకుంటున్నారు. వికేంద్రీకరణే తమ ప్రాధాన్యమంటూ మోదీ సాక్షిగా జగన్ వ్యాఖ్యానించారు. అయినా ప్రధాని పట్టనట్టే వ్యవహరించారు.కాగా.. ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశ చెందుతున్నారు. విభజన హామీలు, పోలవరం, స్టీల్‌ప్లాంట్, రైల్వేజోన్ ఏర్పాటుపై సభలో సీఎం జగన్ ప్రస్తావించారు. జగన్ విజ్ఞప్తులపై మోదీ స్పందించలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ ఏ హామీ ఇవ్వలేదంటూ నిరాశ చెందుతున్నారు
Whats-App-Image-2022-11-12-at-5-14-15-PM
Whats-App-Image-2022-11-12-at-5-14-14-PM
Whats-App-Image-2022-11-12-at-5-14-13-PM-1
Whats-App-Image-2022-11-12-at-5-14-13-PM
Whats-App-Image-2022-11-12-at-5-14-12-PM-1
Whats-App-Image-2022-11-12-at-5-14-12-PM
Whats-App-Image-2022-11-12-at-5-14-11-PM-1
Whats-App-Image-2022-11-12-at-5-14-11-PM
Whats-App-Image-2022-11-12-at-5-14-09-PM-1
Whats-App-Image-2022-11-12-at-5-14-09-PM
Whats-App-Image-2022-11-12-at-5-14-08-PM-1
Whats-App-Image-2022-11-12-at-5-14-08-PM
Whats-App-Image-2022-11-12-at-4-13-20-PM