Movies

అది ఉంటే చాలు!

అది ఉంటే చాలు!

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్స్‌లో ఒకరైన రాధిక ఆప్టే మరోసారి మేకర్స్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. హీరోయిన్లు అవకాశాల విషయంలో వయసు చాలా ప్రభావం చూపిస్తోందని ఆమె అంటున్నారు. తాజాగా రాధిక ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తాజా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కొత్త హీరోయిన్‌లనే తమ సినిమాల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అలా నేను ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నా. కథానాయికలకు ఆఫర్స్‌ రావడంలో వయసు కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే కమర్షియల్‌ చిత్రాల్లో యువ నటీమణులకే ఎక్కువగా అవకాశాలు అందుతున్నాయి. కథానుగుణంగా యువతారలను సెలెక్ట్‌ చేసుకోవడానికే ఫిల్మ్‌ మేకర్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. ‘హీరోయిన్‌కు కావాల్సిన లక్షణాలు మీకు లేవు’ అనే కామెంట్స్‌ను ఈ పరిశ్రమలో ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. ఆఫర్స్‌ కోసం సర్జర్జీలు చేయించుకున్నవారిని చూస్తున్నాం. టాలెంట్‌ని కాకుండా లుక్స్‌ని బట్టి అవకాశాలివ్వడం భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఉంది. దానికి వ్యతిరేకంగా మహిళలు ఇప్పుడిప్పుడే గొంతు ఎత్తుతున్నారు’’ అని రాధిక ఆప్టే అన్నారు. తాజాగా ఆమె నటించిన ‘మౌనికా ఓ మై డార్లింగ్‌’ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ద్వారా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాధిక పోలీస్‌ ప్రాతలో కనిపించారు.