NRI-NRT

డెమోక్రాట్ల వ‌శ‌మైన‌ ఆరిజోనా సేనేట్

డెమోక్రాట్ల వ‌శ‌మైన‌ ఆరిజోనా సేనేట్

అమెరికా సేనేట్ రేసులో ఆరిజోనా రాష్ట్రాన్ని డెమోక్ర‌టిక్ పార్టీ సొంతం చేసుకున్న‌ది. దీంతో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలు ప్ర‌స్తుతం 49 సీట్ల‌తో స‌మానంగా నిలిచాయి. అయితే ఇంకా నెవ‌డా, జార్జియా రాష్ట్రాల ఫ‌లితాలు రావాల్సి ఉంది. ఆరిజోనాలో డెమోక్రాట్ నేత మార్క్ కెల్లీ విజ‌యం సాధించారు. సేనేట్‌లో ప్ర‌స్తుతం రిప‌బ్లిక‌న్ల వ‌ద్ద కూడా 49 సీట్లు ఉన్నాయి. నెవ‌డాలో జ‌రుగుతున్న కౌంటింగ్‌లో రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే జార్జియాలో మాత్రం మ‌ళ్లీ వ‌చ్చే నెల‌లో ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌లో మాత్రం రిప‌బ్లిక‌న్ల‌దే పైచేయిగా నిల‌వ‌నున్న‌ది. సేనేట్‌లో మిగితా రెండు సీట్ల‌ను డెమోక్రాట్లు గెలిస్తే వాళ్ల ఆధిప‌త్యం ఉంటుంది. ఒక‌వేళ ఆ సీట్లు కోల్పోతే అప్పుడు బైడెన్ ప్ర‌ణాళిక‌ల‌ను రిప‌బ్లిక‌న్లు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి.