NRI-NRT

2023 నుంచి యూఏఈ కొత్త నిబంధన

2023 నుంచి యూఏఈ కొత్త నిబంధన

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్మ రో కొత్త రూల్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. 2023 ప్రారంభం నుంచి నిరుద్యోగ బీమా పథకాన్ని కొనుగోలు చేయడం తప్పనిసరి చేస్తున్నట్లు మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించింది. ప్రైవేట్ రంగ సంస్థలు, సమాఖ్య ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నెలకు 5దిర్హమ్స్ (రూ.109) నుండి నిరుద్యోగ బీమా పథకంలో సభ్యత్వాన్ని పొందవచ్చని తెలిపింది. క్రమశిక్షణేతర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయినట్లయితే ఈ పథకం పరిమిత కాల వ్యవధిలో ప్రతి క్లెయిమ్‌కు వరుసగా మూడు నెలలకు మించకుండా నష్టపరిహారాన్ని అందిస్తుంది. ఇక ఈ బీమా పథకం రెండు గ్రూపులుగా విభజించబడింది. వీటిలో మొదటిది 16వేల దిర్హమ్స్ (రూ.35,0876) వరకు బేసిక్ పేలను కలిగి ఉంటుంది. ఈ కేటగిరీలో బీమా చేయబడిన ఉద్యోగికి బీమా కోసం నెలవారీ ప్రీమియం 5దిర్హమ్స్ (రూ.109) లేదా ఏటా 60 దిర్హమ్స్ (రూ.1315) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెండో కేటగిరీలో బేసిక్ పే 16వేల దిర్హమ్స్ (రూ.35,0876) కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులు ఉంటారు. ఈ కేటగిరీకి చెందిన వారికి బీమా కోసం నెలవారీ ప్రీమియం 10దిర్హమ్స్ (రూ.219) లేదా ఏడాదికి 120 దిర్హమ్స్ (రూ.2631) ఉంటుంది. నిరుద్యోగ బీమా పథకానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http://www.iloe.aeలో చూడొచ్చని అధికారులు సూచించారు.