Movies

మితిమీరిన అభిమానం.

మితిమీరిన అభిమానం.

హద్దులు దాటే అమృతమూ విషయమైనట్లు..మితి మీరిన అభిమానం ఓ వ్యక్తిని కటకటాల పాలు చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ను విపరీతంగా ఇష్టపడే మన్వీందర్‌ సింగ్‌ అనే అభిమాని ఆమె పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. గతేడాది హీరో విక్కీ కౌశల్‌ను కత్రినా ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు ఎవరి సినిమాల్లో వాళ్లు నటిస్తూ తమ కెరీర్‌లను కొనసాగిస్తున్నారు.గత కొద్ది రోజులుగా ఈ జంటకు సోషల్‌ మీడియా ద్వారా బెదిరింపు సందేశాలు పంపిస్తున్నాడు మన్వీందర్‌. ఈ జంటను హతమారుస్తానని మెసేజ్‌లు పంపుతున్నాడు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన శాంతాక్రజ్‌ పోలీసులు సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అభిమానం, ఆకతాయితనంతోనే మన్వీందర్‌ సింగ్‌ ఇలా చేశాడా, నిజంగానే హత్య కుట్రకోణం ఉందా అనే విషయంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కత్రినా ‘టైగర్‌ 3’, ‘మెరీ క్రిస్మస్‌’, ‘ఫోన్‌ బూత్‌’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.