DailyDose

TNI నేర వార్తలు

TNI నేర వార్తలు

* గుంటూరు నగరంలో అరండల్‌పేట 7/3 లోని శ్రీ మోహన రంగనాయక స్వామి వారి దేవస్థానానికి చెందిన స్థిరాస్తి పాత గుంటూరులో ఉందన్నారు.తమ్మ రంగారెడ్డి నగర్‌లో వున్న 7 ఎకరాల 16 సెంట్ల దేవాలయ ఆస్తులను కొందరు ఆక్రమించి,కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకొన్నారని తెలిపారు.అందులో ఇళ్లు నిర్మించుకొన్న వారిపై న్యాయస్థానంలో సివిల్ కేసు దాఖలు చేశామన్నారు.ఫోర్జరీ సంతకాలతో అప్పట్లో దేవాదాయ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్ ను 19 మందికి చేసిందని, ఆ 19 రిజిస్ట్రేషన్లను కోర్టు వారు రద్దు చేశారని తెలిపారు.దానికి సంబంధించిన సివిల్ దావాలో దేవాలయ ఆస్తులను తక్షణమే దేవాదాయ శాఖ వారు సదరు ఆస్తులను స్వాధీన పరుచుకోమని 2005లో గుంటూరు జిల్లా కోర్టు వారు ఇచ్చిన తీర్పును అనుసరించి, దేవాదాయ శాఖ వారు కోర్టులో ఈ 19మంది ఆస్తుల స్వాధీనం కోసం వేసిన ఎవిక్ పిటీషన్ (ఈ పి) లో ప్రస్తుతానికి 9 మంది ఆస్తులను తక్షణమే సీలు వేసి కోర్టుకు తెలియజేయాలని,సంభదిత ఆస్తులను దేవస్థానానికి తక్షణమే అధికారులు అప్పగించాలని గుంటూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ప్రభుత్వ అధికారులకు ఈ నవంబర్ నెల 11న శుక్రవారం నాడు ఆస్తుల స్వాధీన వారెంట్ ఉత్తర్వులు జారీ చేసారన్నారు. గుంటూరు సిటీ సర్వేయర్(నగర పాలక సంస్ద, గుంటూరు),పోలీసు డిపార్ట్‌మెంట్ తదితర ప్రభుత్వ అధికారులకు సైతం కోర్టు వారు ఈ వారెంట్లు జారీ చేసిందని తెలిపారు. గౌరవ న్యాయ స్థానఆదేశాలను అధికారులు తక్షణమే అమలుచేసి రాజకీయ,ప్రభుత్వ,ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు తలోగ్గకుండా ఆస్తులను దేవాలయానికి అప్పగించాలని దేవాలయ భక్త బృందాలు, బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని శ్రీధర్ తెలిపారు.ఇప్పటికే కోర్టు వారి ఆదేశాలను అమలు పరుచు విషయంలో ప్రభుత్వ అధికారులు గత 17 సంవత్సరాలుగా కాలయాపనచేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయకుండా రాజకీయ వొత్తిళ్లతో తాత్సారం చేస్తున్నారని,ఇప్పటికైనా కోర్టు ఉత్తర్వులు అమలుజేయని పక్షంలో ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని శ్రీధర్ అధికారులను హెచ్చరించారు.ఈ సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శిరిపురపు శ్రీధర్ శర్మ తోపాటు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేశరాజు పట్టాభి రామచంద్ర మూర్తి,నల్గొండ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

* లూరు పవర్ పేట రైల్వే స్టేషన్ లో సుమారు 30 నుంచి 35 సంవత్సరముల వయస్సు కలిగిన గుర్తు తెలియని పురుషుడు, గుర్తు తెలియని రైలు బండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుడి చేతి పై ” అమ్మ” మరియు ” జగ్ద “అను తెలుగు అక్షరాలతో మరియు 🕉️ గుర్తుతో పచ్చబొట్టు కలదు. మృతుడు లేత కాషాయం రంగు పొడవు చేతుల చొక్కా మరియు నీలం రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని జేబులో టేపు కలదు. మృతుడు సిమెంట్ పనులు చేసే వ్యక్తిగా కనపడుతున్నాడు. ఏలూరు రైల్వే ASI, P.సైమన్ (9989219559) కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు.

* కోపూరి రమేష్ ను విజయవాడ అంబేద్కర్ నగర్ ఔట్ ఏజెన్సీ ప్రాంతంలో హత్య చేసిన ఘటనలో పాల్గొన్న ఐదుగురిని రిమాండ్ కు తరలించి విలేకరుల సమావేశం నిర్వహించిన ఏసిపి హనుమంతరావు.ఈ హత్యలో పాల్గొన్న వారంతా నేర చరిత్ర కలిగిన వారు కావడంతో ఎ సి పి హనుమంతరావు కేసు సీరియస్ గా తీసుకొని,ఈ కేసులో సాక్ష్యధారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఒక్క ఆధారం వదలకుండా హత్యలో పాల్గొన్న మిగతా నేరస్తులను వెంటనే అరెస్టు చేసి కోర్టుకు తరలించాలని భవానిపురం సీఐ ఉమర్, కు ఆదేశాలు జారీ చేశారు.వెంటనే సిఐ ఉమర్ హత్యలో పాల్గొన్న మరొక ఐదుగురిని అరెస్టు చేసి ఈరోజు కోర్టుకు తరలించారు.

* దుప్పట్ల వ్యాపారం ముసుగులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడిన నలుగురు సభ్యుల దొంగల ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2.40.000 రూపాయలు స్వాధీన పరుచుకున్నామని విలేకరుల సమావేశంలో తెలిపిన డిసిపి వెంకటలక్ష్మి.. పాల్గొన్న ఏసీపీ నరేష్ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది.

* ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొర్రతండాకు చెందిన పదవ తరగతి విద్యార్థి కుర్ర అంకిత్ (17)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా ఆగ్రహించిన బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తిరువూరు సీఐ భీమరాజు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

* విస్సన్నపేటలో గత 3నెలల క్రితం మేశపాం శరత్ బాబు బైకు ప్రమాదం..కాదు హత్యాయత్నమే అంటున్న కుటుంబ సభ్యులు.బైక్ ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు..

శరత్ బాబుపై హత్యాయత్నం జరిగిందని కేసును తారుమారు చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం.. వెంటనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని శరత్ బాబుకు న్యాయం చేయాలని బస్టాండ్ సెంటర్లో భారీగా ధర్నా చేపట్టిన బంధువులు, కుటుంబ సభ్యులు..కేసును తప్పుదోవ పట్టించిన ఎస్సై,సీఐ లను సస్పెండ్ చేయాలని నినాదాలు..

* వినుకొండ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు లో డ్రైవర్ శ్రీనివాస్ తన పట్ల అసభ్య కరంగా ప్రవర్తించాడు అని నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో బంధువులతో కలసి దేహ శుద్ధి చేసిన మహిళ…..విజయవాడ నుండి వినుకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు…

* దేశంలో రోడ్డుప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్లేకుండా వాహనం నడపడం చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. ఇక పిల్లలకు వాహనం ఇచ్చి ముచ్చటపడుతున్నారంటే జైలుకు వెళ్లే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. మీ వాహనం తీసుకెళ్లి వేరేవాళ్లు యాక్సిడెంట్ చేస్తే.. మీకూ చిక్కులు తప్పవని చెబుతున్నారు.మైనర్లు వాహనం నడపడం ప్రమాదాలకు దారితీస్తుందనే ఉద్దేశంతో దీనిపై ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది