Devotional

కార్తిక మాసము వనభోజనం ప్రాధాన్యమీదే!

కార్తిక మాసము వనభోజనం ప్రాధాన్యమీదే!

వనం అంటే బ్రహ్మవనం. ‘బ్రహ్మ సవృక్ష ఆసీత్‌’ అని వేద వాక్యం. వనం అంటే పరమాత్మ. భోజనం అంటే ప్రాప్తి, సేవ. వనభోజనం అంటే పరమాత్మను చేరుట, పరమాత్మను సేవించుట. ఆ పరమాత్మ వృక్ష రూపంలో ఉన్నాడు. కార్తికం జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకున్నారు. అందుకోసం కార్తిక మాసములో వన భోజనం చేస్తారు. ఆ వనం కూడా పావనం కావాలి, సావనము(రక్ష) కావాలి, ఆ సావనమే మన జీవనమంతా నిండి ఉండాలి. ఉసిరి, నిమ్మ, తలసీ, అర్క, వటం, అశ్వద్ధ, జంబు వృక్షాలలో ఏవో కొన్ని వృక్షాలున్న వనంలోకి వెళ్లి అక్కడే రెండో సారి స్నానం చేసి వంట సామాగ్రి వెంట తీసుకుని, పైన చెప్పిన చెట్ల నీడలో
కృత్తికే హనమే పాపం కృత్తికే జ్ఞానదర్శిని
కృత్తికే దేహి సౌభాగ్యం, మోక్ష భాగ్యంచ దేహిమే

(మే-నాకు)అనే కృత్తికా మంత్రాన్ని పఠిస్తూ వంట చేసి మన ఇష్ట దైవాన్ని ఆరాధించి, రెండు ఘడియల(48 నిమిషాలు)కు తగ్గకుండా భగవన్నామ స్మరణ చేసి, భగవద్భక్తులతో కలసి భుజించాలి.ఈనాటి కార్తిక వన భోజనాలను వినోద యాత్రగా మలచి విజ్ఞానాన్ని ఆహుతి చేసి అజ్ఞానులై తిరిగి వస్తున్నారు.