NRI-NRT

రాజ‌కీయాల జోలికి వెళ్ల‌ను

Auto Draft

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా చేసిన ఇవాంకా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 2024లో దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌నున్న‌ట్లు ఇవాళ డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. కొన్ని గంట‌ల తేడాలోనే ఇవాంకా కూడా ఓ ప్ర‌క‌ట‌న చేశారు. 2024 కోసం త‌న తండ్రి చేసే ప్ర‌చారంలో పాల్గొన‌డం లేద‌ని ఆమె తెలిపారు.నాన్న‌ను ఎంతో ప్రేమిస్తాన‌ని, కానీ ఈసారి త‌న స‌మ‌యాన్ని పిల్ల‌ల కోసం కేటాయించ‌నున్నాన‌ని, ఫ్యామిలీతోనే గ‌డ‌ప‌నున్న‌ట్లు ఇవాంకా త‌న స్టేట్‌మెంట్‌లో చెప్పారు. రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవాల‌న్న ప్లాన్ లేద‌ని, తండ్రికి ఎప్పుడూ మ‌ద్ద‌తు ఇస్తాన‌ని, రాజ‌కీయ క్షేత్రానికి సంబంధం లేకుండా త‌న పాత్ర ఉంటుంద‌ని ఇవాంకా తెలిపారు.