DailyDose

ఛత్రపతి అంటే అంత ఇష్టం..!

ఛత్రపతి అంటే అంత ఇష్టం..!

సత్యనారాయణపురంలోని శివాజీ కేప్ కూడలి పేరు తెలియని నగరవాసి ఉండరు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కాకర్లపూడి సుబ్బరాజు అనే వ్యాపారి సత్యనారా యణపురంలో అల్పాహార శాల నిర్వహించేవారు. ఈయనకు చత్రపతి శివాజీ ఎంతో అభిమానం. దీంతో హోటల్ కు శివాజీ కేచ్గా పేరు పెట్టుకున్నారు. దాదాపు 15 సంవత్సరాలు నిర్వహించాక వృద్ధాప్యం మీదపడటంతో తన వద్ద సరకు మాస్టరుగా పనిచేస్తున్న దమ్మాలపాటి మాధవరావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 1978 సంవత్సరంలో హోటల్ రజతోత్సవాలు కూడా నిర్వహించారు. అప్పట్లో అదొక వేడుకలా చేశారు. 1990 వరకు మాధవరావు దానిని నడిపి, వేరొకరికి అప్పగించారు. అలా.. మరో ఇద్దరు చేతుల్లోకి మారింది శివాజీ కేప్ -హోటల్, చివరికి దాని ప్రస్థానం 2000 సంవత్సరంలో ముగిసింది. ఆ హోటల్ మూతపడినా.. ఈ కూడలి పేరు మాత్రం శివాజీ కేఫ్ నే కొనసాగడం విశేషం.