NRI-NRT

భారతీయులకు సౌదీ అరేబియా వీసా కోసం ఆ సర్టిఫికెట్ అవసరం లేదు

భారతీయులకు సౌదీ అరేబియా  వీసా కోసం ఆ సర్టిఫికెట్ అవసరం లేదు

భారతీయులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది. వీసా నిబంధనల్లో కీలక సవరణ చేసింది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించే నిబంధనను తొలగించింది. సౌదీ వీసా(Saudi Visa) కోసం ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)ని సమర్పించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది భారతీయులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది. వీసా నిబంధనల్లో కీలక సవరణ చేసింది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించే నిబంధనను తొలగించింది. సౌదీ వీసా కోసం ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)ని సమర్పించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘భారత్‌తో సౌదీకి ఉన్న బలమైన దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని.. వీసా కోసం పీసీసీ సమర్పించాలనే నిబంధన నుంచి భారతీయులకు మినహాయింపు ఇస్తున్నాం. ఇకపై భారతీయులు సౌదీ వీసా కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు’ అని భారత్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది. కాగా.. సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఉపాధి, ఉద్యోగాల కోసం ఆ దేశానికి వలస వెళ్లే భారత పౌరులకు భారీ ఉపశమనం లభించినట్టైంది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాని మహ్మద్ బిన్ సాల్మన్.. ఈ నెలలో భారత్‌లో పర్యటించి.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సౌదీ ప్రధాని భారత పర్యటన రద్దైంది.