Movies

సినిమాల్లోకి కుమార్తె ఎంట్రీపై మంత్రి వ్యాఖ్యలు

సినిమాల్లోకి కుమార్తె ఎంట్రీపై మంత్రి వ్యాఖ్యలు

తన కుమార్తె, కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే.. ఒక తల్లిగా, నటిగా చాలా సంతోషిస్తానని ఏపీ మంత్రి రోజా అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దస్త్ టీం సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. స్వామివారి దివ్యరూపాన్ని ఎన్ని సార్లు చూసినా మర్చిపోలేనిదన్నారు. సైంటిస్టు అవ్వాలనే ఆలోచనలో తన కుమార్తె ఉందని.. ప్రస్తుతానికి సినిమాలో నటించే ఆలోచన ఆమెకు లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.