DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

* హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్‌ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చిప్‌లతో పెట్రోల్‌కు గండి కొడుతున్నారు బంక్ యజమానులు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఎస్వోటీ ఆకస్మిక సోదాల్లో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

* పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని ఖలీల్ దాబా వద్ద కొద్దిసేపటి క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం…. దాచేపల్లి వైపు వెళ్తున్న ఆటో ఒక టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పిడుగురాళ్ల ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు… ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందినట్లు ఆయన తెలిపారు… అయితే మృతి చెందిన మహిళ దాచేపల్లి కి చెందిన ముస్లిం మహిళగా తెలుస్తోంది ఈ ఫోటోలో మహిళ ఎవరికైనా తెలిస్తే బంధువులు పిడుగురాళ్లలోని పలనాడు హాస్పిటల్ కు రావాలని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

* తిరువూరు మండలం చింతలపాడు ఫిల్లింగ్ స్టేషన్ వద్ద లారీ బోల్తా. ఈ ప్రమాదంలో లారీ పైన వరి కోత మిషన్ ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనివలన పక్కనే ఉన్న 11 కెవి వైర్ తెగి అంతరాయం జరిగింది.

* బీహార్‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి స‌మీర్ కుమార్ మ‌హాసేత్ ఇంట్లో ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖ‌కు చెందిన సుమారు 25 మంది స‌భ్యులు మంత్రి ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జ‌రుగుతున్నాయి.త‌నిఖీల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికాలేదు.

* బీహార్‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి స‌మీర్ కుమార్ మ‌హాసేత్ ఇంట్లో ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖ‌కు చెందిన సుమారు 25 మంది స‌భ్యులు మంత్రి ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జ‌రుగుతున్నాయి.త‌నిఖీల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికాలేదు.

* అనారోగ్య సమస్యతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ఒక మహిళ శరీరంలోని రెండు కిడ్నీలను చోరీ చేశారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఈ విషయం బయటపడింది. దీంతో సర్జరీ చేసిన డాక్టర్‌ కిడ్నీని తనకు మార్పిడి చేయాలని ఆ మహిళ డిమాండ్‌ చేసింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల సునితా దేవి అనే మహిళ, గర్భాశయం తొలగింపు కోసం సెప్టెంబర్‌ 3న బరియార్‌పూర్ గ్రామంలోని శుభకాంత్ క్లినిక్‌కు వెళ్లింది. అయితే ఆ ఆసుపత్రిలో సర్జరీ చేసిన వైద్యులు గర్భాశయం బదులుగా ఆమె రెండు కిడ్నీలను అక్రమంగా తొలగించి చోరీ చేశారు.

* గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు విద్యార్థులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో పొన్నెకల్లు గ్రామానికి చెందిన నామాల సాయికుమార్‌(22), నూతక్కి నాగమల్లేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. తాళ్లూరి అజయ్‌కుమార్‌(22) అనే మరో విద్యార్థికి కాళ్లు విరిగాయి.

* డ్రైవర్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్‌ బాలిక ఆటోలో నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.17 ఏళ్ల బాలిక ట్యూషన్‌ ముగించుకుని ఆటోలో ఇంటికి బయలు దేరింది. కొంత దూరం వెళ్లాకా ఆటో డ్రైవర్ సయ్యద్‌ అక్బర్‌ హమీద్‌ బాలికకు పలు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో అసభ్యంగా మాట్లాడి బాలికను వేధించసాగాడు. దీంతో భయాందోళనకు గురైన సదరు బాలిక కదులుతున్న ఆటోలో నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి దూకేసింది. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన కారు సెడెన్‌ బ్రేక్‌ వేయడంతో బాలిక ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకుంది. అప్పుడే బైక్‌పై అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి స్థానికుల సాయంతో బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటోడ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

* కుటుంబ కలహాల కారణంగా మహిళా లెక్చరర్‌పై భర్త హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్ట్స్‌ కళాశాలలో కామర్స్‌ బోధిస్తున్న సుమంగళిని ఆమె భర్త పరేశ్‌ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. భర్తతో విభేదాల కారణంగా ఆమె కోర్టులో విడాకుల కేసు వేశారు. ఈ కేసు కోర్టులో ఉండగానే భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు.

* జ‌మ్మూక‌శ్మీర్‌లోని కిష్టావ‌ర్ జిల్లాలో బుధ‌వారం సాయంత్రం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్ర‌యివేటు క్యాబ్ అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో క్యాబ్‌లో ప్ర‌యాణిస్తున్న వారంతా చ‌నిపోయిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. క్యాబ్‌లో మొత్తం 8 మంది ఉన్న‌ట్లు తెలిపారు. లోయ‌లో ప‌డ్డ క్యాబ్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

* ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఓ అంతర్రాష్ట సైబర్‌ నేరగాడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ. 2.05కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. లోన్ యాప్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర లోన్ యాప్ కమీషన్ ఏజెంట్ జలాల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

* ఏపీలోని పరిశ్రమల్లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ఘటనలు పరిశ్రమల్లో పనిచేసే కార్మిక, ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలోని ఓ ఫార్మా కంపెనీలో మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. మిథనాల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంబవించింది.