Movies

యశోద 2 రెడీ, మరి సమంత రెడీనా ?

యశోద 2 రెడీ, మరి సమంత రెడీనా ?

సమంత రుత్ ప్రభు నటించిన ‘యశోద’ సినిమా గత వారం విడుదలయి మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా మొత్తం తన భుజస్కందయాల మీద మోసిన సమంత ని అందరూ అన్ని విధాలా ప్రసంసిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సీక్వల్ వుంటుందా అన్న ప్రశ్న కూడా ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుంచి ఒక చర్చ నడుస్తోంది. దీనికి దర్శకులు హరి మరియు హరీష్, అలాగే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు. ‘యశోద 2’ గురించి చాలా మంది అడుగుతున్నారు కానీ ఈ సీక్వెల్ ప్రయత్నం మాత్రం దర్శకులు హరి, హరీష్ నుంచి రావాలి అని నిర్మాత అనగానే దర్శకులు రెడీ అన్నారు. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది అని చెప్పారు దర్శకులు. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది అని అయితే… అది సమంత గారిపై ఆధారపడి ఉందని దర్శకులు చెప్తున్నారు. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేసి ఆవిడ ఒప్పుకుంటే సీక్వెల్స్ కచ్చితంగా చేస్తాం అని చెప్పారు దర్శకులు. వెంటనే నిర్మాత కూడా తాను రెడీ గా వున్నట్టు చెప్పారు. ఒక వేల సీక్వల్ వుంటే అందులో వరలక్ష్మి క్యారెక్టర్ కూడా ఉంటుంది అని దర్శకులు చెప్తున్నారు. ఎందుకంటే ‘యశోద’ సినిమాలో సూపర్‌సైంటిస్ట్ ఉన్నిముకుందన్‌ ఉన్నాడు కదా, అతను ఏమైనా చేయగలడు అని నవ్వుతూ చెప్పారు దర్శకులు. ఇదొక సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. కమర్షియల్ పంథాలో తీసినప్పటికీ… ఎమోషన్ ఉంది. ఆ భావోద్వేగాలు అందరికీ రీచ్ అయ్యేలా మాటలు రాసిన పులగం చిన్నారాయన, భాగ్యలక్ష్మి లకి దర్శకులు క్రెడిట్ ఇచ్చారు.