Devotional

అయితే ఏంటి.. అంటూ ఘాటు సమాధానం!

అయితే ఏంటి.. అంటూ ఘాటు సమాధానం!

‘ఆదిపురుష్‌’ లాంటి సినిమాలో భాగమైనందుకు నేనే కాదు మా టీమ్‌ అంతా ఎంతగా గర్వంగా భావిస్తున్నాం. కొందరు సినిమాను ట్రోల్‌ చేస్తున్నారు.)రెండు నిమిషాల నిడివిగల టీజర్‌ చూసి సినిమాను అంచనా వేయడం కరెక్ట్‌ కాదు. మన పురాణాలు, చరిత్రకు సంబంధించిన కథలు ప్రపంచానికి తెలియజేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం’’ అని కృతీసనన్‌ అన్నారు. ప్రభాస్‌ )హీరోగా ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీసనన్‌ సీత పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ విమర్శల పాలైన సంగతి తెలిసింది. దీనిపై నటి కృతీ స్పందించారు. ‘‘టీజర్‌ విడుదలైనప్పుడు ఎక్కువ శాతం మంది కామెంట్‌ చేశారు. రెండు నిమిషాల నిడివి గల టీజర్‌, ట్రైలర్‌తో సినిమాను అంచనా వేయలేం. సినిమాను ఎంతో గ్రాండ్‌గా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మెరుగ్గా చూపించడానికి పని చేస్తున్నారు. ఈ చిత్రం ఫైనల్‌ అవుట్‌పుట్‌ ఎవరినీ నిరాశపరచదు. టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భూషణ్‌కుమార్‌ నిర్మాత. వచ్చే ఏడాది జూన్‌ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
*అయితే ఏంటి?
తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో బ్లూ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. బాలీవుడ్‌ మీడియా ‘మీకు పార్టనర్‌ లేరా’? అనే ప్రశ్న అడిగారు. దీనికి కృతీ ‘అయితే ఏంటి?’ అంటూ ఘాటుగా స్పందించింది. ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కృతీ ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’లో జానకి పాత్రతో అలరించడానికి సిద్ధమవుతోంది