DailyDose

తొలి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో

తొలి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో

ఇస్రో (ISRO) మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి మొట్టమొదటిసారిగా తొలి ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించింది. విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. విక్రమ్‌- ఎస్‌ రాకెట్‌ 6 మీటర్లు పొడవు, 543 కిలోల బరువు కలిగి ఉంది.
హైదరాబాదుకు చెందిన స్కైరూట్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. షార్ కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ మూడు కస్టమర్ పేలోడ్లుతో అంతరిక్షలోకి సాగింది. ప్రయోగ సమయం కేవలం 4నిమిషాల 50 సెకండ్లు. భూ ఉపరితలం నుంచి 103 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహం భూమి మీద బంగాళఖాతం సముద్రం వరకు తీసుకువచ్చేలా రూపకల్పన చేశారు. భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో గాలిలో తేమ, వాతావరణ పరిస్థితులు, తిరుగు ప్రయాణంలో వేగం వంటివి అంచనా వేయనున్నారు
Whats-App-Image-2022-11-18-at-3-33-48-PM