DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

* రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అమీర్ పేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు అగర్ వాల్ సమాజ్ ఆధ్వర్యంలో షూస్ లను మంత్రి అందజేశా

* నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో యాక్సిడెంటల్‌గా గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు

* కేంద్రం అవలంభిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు తిప్పికొడుతున్న సీఎం కేసీఆర్‌ దేశానికి వేగుచుక్కగా కనబడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రములోని పాత వ్యవసాయ మార్కెట్లో పత్తి మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉండడంతో రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఊరట అని అన్నారు.

* రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆడిట్‌ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్‌ ఆడిట్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఆడిటర్‌గా పనిచేస్తున్న జాటోత్‌ కిశోర్‌కుమార్‌ రూ. 18వేలు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న సివిల్‌ కానిస్టేబుల్‌ పెన్షన్‌ డబ్బుల కోసం ఆడిట్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

* సికింద్రాబాద్ మారేడ్‌ప‌ల్లిలోని క‌స్తూర్బా కాలేజీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఇంట‌ర్ బ్లాక్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థినులు ప్రాక్టిక‌ల్స్ చేస్తుండ‌గా.. విష వాయువులు లీక్ అయ్యాయి. దీంతో విద్యార్థినులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 10 మంది విద్యార్థినులు స్పృహ కోల్పోయారు. దీంతో కాలేజీ యాజ‌మాన్యం అప్ర‌మ‌త్త‌మైంది. బాధిత విద్యార్థినుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

* మ‌నీల్యాండ‌రింగ్ కేసులో శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ మూడు నెల‌ల పాటు జైలు శిక్ష అనుభ‌వించిన విష‌యం తెలిసిందే. జైలులో ఉన్న స‌మ‌యంలో 10 కిలోల బ‌రువు త‌గ్గిన‌ట్లు రౌత్ తెలిపారు. ఓ మీడియా సంస్థ‌తో ఆయ‌న ఇవాళ మాట్లాడారు. గుడ్డు లాంటి సెల్‌లో వేశార‌ని, దాని వ‌ల్ల 15 రోజుల పాటు సూర్య కిర‌ణాల్ని చూడ‌లేక‌పోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆ కార‌ణంగా త‌న‌కు కంటి చూపు స‌మ‌స్య‌లు వచ్చిన‌ట్లు రౌత్ వెల్ల‌డించారు. ఒక‌వేళ తాను బీజేపీకి లొంగిపోయి ఉంటే అప్పుడు త‌న‌ను అరెస్టు చేసేవారు కాద‌న్నారు.

* నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్‌ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆయన కుమారుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా.. ఎన్సీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నది.

* భారీ వర్షాలు తగ్గిపోవడంతో రెండు రోజులుగా పొడి వాతావరణం మొదలైంది. చలికాలం కావడంతో వాతావరణం చల్లబడి మంచు కురుస్తోంది. ఉదయం 10.30 గంటల వరకు కాంచీపురం పట్టణమంతా మంచు కురుస్తూ ‘జిల్‌’ వాతావరణం నెలకొంది.

* అహ్మదాబాద్ నుంచి చెన్నై( వెళ్తున్న నవజీవన్ ఎక్స్‎ప్రెస్ పెద్ద ప్రమాదం తప్పింది. నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైల్‎లో మంటలు చెలరేగాయి. పాంట్రీకారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్‎లో మంటలను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‎లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. రైల్వే వర్గాల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు

* భారీ ముడుపులు తీసుకుని విద్యుత్ ఉత్పత్తి సంస్థలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ప్రైవేటుకు అమ్మేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ రంగం సంక్షోభం దశను దాటి మునిగిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. రూ.5కు లభించే యూనిట్ విద్యుత్‌ను రూ.20కి కొనుగోలు చేస్తూ మొత్తం రంగాన్ని కుదేలుచేశారని మండిపడ్డారు. విజయవాడ నార్ల తాతారావు విద్యుత్ కేంద్రాన్ని కూడా అమ్మకానికి సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు.ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి 8వ సారి విద్యుత్ బాదుడుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మూడు డిస్కింలు అంపశయం మీద ఉన్నాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తానన్న జగన్ రెడ్డి ఉన్న ఉద్యోగాలు పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని జీవీ రెడ్డి (TDP Leader ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

* పోలవరం ప్రాజెక్ట్‌ ను ఎత్తిపోతల పధకంగా మార్చడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ… పోలవరం ప్రాజెక్టును ఎత్తిపోతలుగా మార్చడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని అన్నారు. కమిషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ డ్రామాతో జరుగుతున్న పనులు ఆపారని… .ఏడాదిగా ఒక్కశాతం పనులు చేయలేదని మండిపడ్డారు. 31మంది ఎంపీలుండి ఒక్కసారైనా నిధులు అడిగారా? అని ప్రశ్నించారు. కేసుల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టిన సీఎం జగన్ పోలవరం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. టీఏసీలో 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు రూ.55,548 కోట్లకు ఆమోదం తెస్తే 42 నెలలుగా ఏం చేశారని నిలదీశారు. 194 టీఎంసీల నీటిని ఎప్పుడు నిల్వ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులను మోసం చేసి గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు.

* కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్సీ గాయత్రీ శాంతేగౌడ(Gayatri Santhegowda) నివాసంపై గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. చిక్కమగళూరు నగరంలోని మార్కెట్‌ రోడ్‌ నివాసానికి సుమారు పది వాహనాల్లో వచ్చిన అధికారులు నిరంతరంగా సోదాలు నిర్వహించారు. గాయత్రి నివాసంతో పాటు కార్యాలయం, ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తుల నివాసాలు, మర్లెలోని క్రషర్‌పైనా దాడులు చేశారు. హాసన్‌ జిల్లా బేళూరులోని గాయత్రి అల్లుడి నివాసంపైనా ఏకకాలంలో దాడి జరిగింది. కాగా బెంగళూరు(Bangalore నగరం నాగరబావిలోని గాయత్రి నివాసంపైనా అధికారులు దాడి చేశారు. అధికారులు దాడికి వచ్చే సమయానికి గాయత్రి దంపతులు తిరుపతికి వెళ్లారు. మూడు రోజుల నుంచి స్థానికంగా అందుబాటులో లేరు. చిక్కమగళూరులోని నివాసంలో ఆమె కుమార్తె మాత్రమే ఉన్నారు. ఐటీ దాడి జరిగే సమయంలో స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆమె నివాసం ఎదుట పెద్దఎత్తున చేరిన కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఐటీని దుర్వినియోగం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీటీ రవి నివాసంపై ఎందుకు దాడులు జరగవంటూ నినాదాలు చేశారు. ఎన్నికల వేళ ఓటమి భయంతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు ఆందోళనలు దిగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

* జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సి) చీఫ్‌ పదవికి ఫరూక్‌ అబ్దుల్లా గుడ్ బై చెప్పారు.మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దీంతో ఫరూక్ వారసుడిగా ఒమర్అధ్యక్షుడిగా రానున్నారు. శ్రీనగర్‌లో తన పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

* క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ సహా వెళ్లిన రమణను ఈడీ జూన్‌లో నేపాల్‌లో నిర్వహించిన బిగ్‌ డాడీ ఈవెంట్‌పై ప్రశ్నిస్తోంది. చికోటి ప్రవీణ్‌ నుంచి తనకు నేపాల్‌ ఈవెంట్‌కు ఆహ్వానం ఉందని.. కానీ తాను వెళ్లలేదని ఎల్‌.రమణ చెబుతున్నారు. నేపాల్‌లో జరిగిన ఈవెంట్లపై ఎల్‌.రమణను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. క్యాసినో కేసులో 18 మంది రాజకీయ నేతలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే తలసాని సోదరులతో పాటు వైసీపీ నేత గరునాథ్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. వెగాస్ బై బిగ్ డాడీ పేరుతో స్పెషల్ ఈవెంట్స్‌‌ను చికోటి ప్రవీణ్ నిర్వహించాడు. మే నెలలో కొన్ని చోట్ల, జూన్‌లో గోవా, నేపాల్‌లో.. భారీగా చికోటి ప్రవీణ్‌కుమార్‌ ఈవెంట్స్‌ నిర్వహించాడు. ఈ ఈవెంట్స్‌కు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.

* నెల్లూరు జిల్లా…రైలు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదంగూడూరు జంక్షన్ వద్ద అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు ..ట్రైన్ లోని కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.. గూడూరు రైల్వే స్టేషన్లో మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులు..సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన ట్రైన్..రైల్వే అధికారులు అప్రమత్తం అవడం తో తప్పిన భారీ ప్రమాదం..గంట ఆలస్యంగా బయలు దేరిన రైలు..

* మహారాష్ట్రలోని ముంబయి-పుణె జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయాలపాలయ్యారు.స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మారుతీ సుజుకీ ఎర్టిగా కారు పుణె నుంచి ముంబయి వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ముంబయి-పుణె జాతీయ రహదారి రాయ్‌గఢ్‌ జిల్లా కోప్లీ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

* మంత్రి హరీష్‌రావు రాజ్‌భవన్‌ నుంచి పిలుపు వచ్చింది. మెడికల్ టీచింగ్ స్టాప్ పదవి విరమణ వయస్సు పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై అసంతృప్తితో ఉన్నారు. బిల్లులో టీచింగ్ స్టాప్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడుకేషన్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడుకేషన్ పోస్టుల రిటైర్ట్మెంట్ వయస్సును పెంచడంపై గవర్నర్ (Telangana Governor) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్‌రావుకు రాజ్‌భవన్‌ నుంచి పిలుపు అందింది. ప్రొఫెసర్ల వయోపరిమితిని 62 నుంచి 65 ఏండ్లకు పెంచుతూ తెలంగాణ సర్కార్ బిల్లు తెచ్చిన విషయం తెలిసిందే

* రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీపావళి ముందే వణికించి.. తర్వాత కాస్త తగ్గిన చలి.. మళ్లీ జూలు విదుల్చుతోంది. ఇటీవలి వరకు 15 డిగ్రీలున్న కనిష్ఠ ఉష్ణోగ్రత ఇప్పుడు ఏక సంఖ్యలోకి వస్తోంది. రంగారెడ్డి జిలా తాళ్లపల్లిలో గురువారం అత్యల్పంగా 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.1 డిగ్రీలు, వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 9.2, కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 9.7 డిగ్రీలుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చాలాచోట్ల ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువే ఉంది. కాగా, మూడు రోజులుగా శీతల గాలులతో రాజధాని హైదరాబాద్‌ వణుకుతోంది. రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల మధ్య బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గురువారం రాజేంద్రనగర్‌లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తమ్మీద హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.6 డిగ్రీలుంది. అయితే, ఇది సాధారణ సగటు కంటే నాలుగు డిగ్రీలు తక్కువ. రానున్న రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా ఉంటాయని బేగంపేట వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఇకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఏటా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు(యు) మండలంలో అత్యల్పంగా 10.4 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాతావరణం నిలకడగా 12 డిగ్రీల కంటే తక్కువగా ఉంటోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ చలి తీవ్రత పెరిగింది

* పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు మండలం దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు. కేంద్రంలో ఆన్‌లైన్ అవ్వకపోవడంతో రైతులు ఆందోలన చేపట్టారు. రేపటి నుండి ధాన్యం తూకాలు చేపట్టలేమంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. రోజుకి 50 లారీల ధాన్యం వెళ్లవలసి ఉన్నా ఐదు లారీలు కూడా ఆన్‌లైన్ కాలేదంటూ నిరసనకు దిగారు. ఉదయం నుంచి రోడ్ల పైనే ధాన్యం నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిస్కారం కాకపోతే ఆత్మహతలే శరణ్యం అని రైతులు వాపోతున్నారు.

*రాష్ట్రంలో బీజేపీ మిత్ర పక్షమైన జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) కార్యక్రమాలను అడ్డుకుంటే ఊరుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu veerraju) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పవన్పై అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం సరికాదన్నారు. చర్చిలకు రూ.175 కోట్లు నిధులు అంట… ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నించారు. ప్రభుత్వం సొమ్ము చర్చిలకు ఎలా ఇస్తారని నిలదీశారు. మతతత్వ పార్టీ.. మతాలతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. జగన్రెడ్డి ప్రభుత్వం (Jagan reddy Govt.) బరి తెగించి వ్యవహరిస్తోందని, ప్రభుత్వ తీరుపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని సోమువీర్రాజు హెచ్చరించారు.

*గురువారం ఉదయం 11.30 గంటలు.. రోడ్లు భవనాల శాఖ అధికారులతో రెండున్నర గంటల పాటు సీఎం కేసీఆర్‌ సమావేశం. రహదారులు, భవనాల నిర్మాణాలకు సంబంధించి పనులను వేగిరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. మధ్యాహ్నం 2.30 గంటలు.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష. వైద్య రంగంలో పలు అంశాల పురోగతిపై గంటన్నరకుపైగా చర్చ. ఆ శాఖకు చెందిన భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు హుకుం. సాయంత్రం 4.30 గంటలు.. నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం వద్దకు కేసీఆర్‌ పయనం.

*సరాస్‌-2022 పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనను హైదరాబాద్‌లోని నెక్లె్‌సరోడ్‌ పీపుల్‌ ప్లాజాలో ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 28 వరకు నిర్వహించనున్నారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం దాదాపు 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

*పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలోని రెండో అంతస్తులో రాజుకున్న మంటలు నిమిషాల వ్యవధిలోనే సీటీ స్కాన్ గది, ఎక్స్ రే రూంలోకి వ్యాపించాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం( సంభవించిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.అదృష్టవశాత్తూ ఈ అగ్ని ప్రమాదంలో రోగులెవరూ గాయపడలేదు.10 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రులు ఫిర్హాద్ హకీం, అరుప్ బిశ్వాస్, డీసీపీ ఆకాష్ మఘారియాలు సందర్శించారు.

* రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కింద లబ్ధిపొందడానికి స్థానిక ఎమ్మెల్యే ఆమోదంగానీ, సిఫార్సుగానీ అక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఆమోదం లేనందున దరఖాస్తును తిరస్కరిస్తూ వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ జారీచేసిన మెమోను కొట్టేసింది. పిటిషనర్‌ల దరఖాస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలక్షన్‌ కమిటీకి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దళితబంధు మంజూరులో అధికారులు వివక్ష చూపుతున్నారని, ఎమ్మెల్యే ఆమోదం లేదనే కారణంతో దరఖాస్తును తిరస్కరించారని పేర్కొంటూ వరంగల్‌ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన జన్ను నూతన్‌బాబు, మరికొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్‌ వాదనలు వినిపిస్తూ తమ పార్టీ వారు కాదన్న కారణంతో ఎమ్మెల్యే సిఫార్సు చేయలేదని చెప్పారు.

*‘‘వైసీపీ ప్రభుత్వ పెద్దల అక్రమార్జన విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో భారీగా తరలుతోంది. కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు విమానాశ్రయ రక్షణకు రావాల్సి ఉన్నా అడ్డుకొని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర పోలీసులను ఈ విమానాశ్రయం భద్రతకు పెట్టుకొన్నారు. నల్ల ధనం తరలింపునకు ఇబ్బంది రాకుండా ఉండటానికే ఈ ఏర్పాటు జరిగింది. బేగంపేట విమానాశ్రయం మాదిరిగానే గన్నవరం నుంచి జరిగిన ప్రత్యేక విమానాల రాకపోకలపై కూడా సీబీఐ, ఈడీ దర్యాప్తు జరపాలి’’ అని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘వైసీపీ నేతల అక్రమార్జన, డబ్బు తరలింపుపై మేం చెప్పిన విషయాలన్నీ ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి చార్టర్డ్‌ విమానాల ద్వారా నల్ల ధనం తరలిపోయిందని సీబీఐ, ఈడీ నిర్ధారణకు వచ్చాయి.

*పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుస్తక మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 35వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం డిసెంబరు 22 తేదీన ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా జనవరి 1 వరకు అంటే 10 రోజుల పాటు ప్రదర్శన కొనసాగనుంది. ఎప్పట్లాగే తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల పుస్తకాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు వందకు పైగా ప్రచురణకర్తలు ఈసారి కూడా వస్తున్నారు. ఈ మహోత్సవంలో 300కు పైగా పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పుస్తక మహోత్సవం అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్‌ ఈ వివరాలను తెలిపారు.

*ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కింద లబ్ధిపొందడానికి స్థానిక ఎమ్మెల్యే ఆమోదంగానీ, సిఫార్సుగానీ అక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఆమోదం లేనందున దరఖాస్తును తిరస్కరిస్తూ వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ జారీచేసిన మెమోను కొట్టేసింది. పిటిషనర్‌ల దరఖాస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలక్షన్‌ కమిటీకి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దళితబంధు మంజూరులో అధికారులు వివక్ష చూపుతున్నారని, ఎమ్మెల్యే ఆమోదం లేదనే కారణంతో దరఖాస్తును తిరస్కరించారని పేర్కొంటూ వరంగల్‌ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన జన్ను నూతన్‌బాబు, మరికొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్‌ వాదనలు వినిపిస్తూ తమ పార్టీ వారు కాదన్న కారణంతో ఎమ్మెల్యే సిఫార్సు చేయలేదని చెప్పారు.

* సరాస్‌-2022 పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనను హైదరాబాద్‌లోని నెక్లె్‌సరోడ్‌ పీపుల్‌ ప్లాజాలో ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 28 వరకు నిర్వహించనున్నారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం దాదాపు 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహిళల ఉత్పత్తులను ఒకే వేదికపైకి చేర్చి పరస్పర అనుభవాలను పంచుకోవడంతో మరింత ఉపాధికి అవకాశం ఉంటుందన్నారు.

*శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో ఏ సమయంలో జలవిద్యుత్‌ చేయాలి..? ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఏ నెలలో ఏ విధంగా ఉండాలి..? మిగులు జలాల లెక్కింపునకు ప్రామాణికం ఏంటి..? తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 24న రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశం పెడుతున్నామని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) పేర్కొంది. ఇప్పటికే జరిగిన సంప్రదింపులకు అనుగుణంగా ఆయా అంశాలపై తీసుకున్న నిర్ణయాలపై తెలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోయినా, సమావేశానికి హాజరుకాకపోయినా.. ఆర్‌ఎంసీ లక్ష్యం విఫలమైందని కృష్ణా బోర్డుకు నివేదిస్తామని ఆర్‌ఎంసీ కన్వీనర్‌, కేఆర్‌ఎంబీ సభ్యుడు రవికుమార్‌ పిళ్లై స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు గురువారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 24న జరిగే సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

*రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ) ఎన్‌.పద్మజను నియమిస్తూ జగన్‌ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ శాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అక్షింతలు వేస్తున్నా జగన్‌ ప్రభుత్వం తీరు మారలేదు, అడుగు వెనక్కు పడడం లేదు. కోర్టు అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ కొద్ది రోజుల క్రితం సినీ నటుడు అలీని ఎలకా్ట్రనిక్‌ మీడియా సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. మొత్తంగా 47 మంది వైసీపీ ప్రభుత్వానికి సలహాదారులుగా నియమితులయ్యారు. పద్మజ నియామక ఉత్తర్వులు ఆగస్టులో వెలువడ్డాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. ప్రభుత్వ ఉత్తర్వులు పౌరులకు అందుబాటులో లేకుండా రహస్యంగా ఉంచడంపై హైకోర్టులో వేసిన పిటిషన్‌ విచారణకు వస్తున్న సమయంలోనే సుమారు రెండు నెలలపాటు రహస్యంగా ఉంచిన ఈ జీవో వెలుగులోకి వచ్చింది.

*గురజాడ విశిష్ఠ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును ఎంపిక చేశారు. సమాఖ్య ప్రతినిధులు వి.నరసింహారాజు, కాపుగంటి ప్రకాష్‌, ఎ.గోపాలరావు ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. చాగంటికి ఈ నెల 30న గురజాడ వర్ధంతి రోజున పురస్కారం అందజేస్తామని తెలిపారు.

*వైద్యుల నియామకాలు, పదోన్నతులు, రీ-పోస్టింగ్‌ ఆర్డర్లలోనూ ఇష్టారాజ్యంగా నిబంధనలు పెట్టిన ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీలోనూ గందరగోళం సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం 49 పీజీ విభాగాల్లో కలిపి 1,458 మంది సీనియర్‌ రెసిడెంట్లు అవసరం. మొత్తం 1,458 ఎస్‌ఆర్‌ ఖాళీల భర్తీకి ఆరోగ్యశాఖ పరిధిలోని డీఎంఈ(డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) విభాగం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

*రాజకీయ విశ్లేషకుడు, కుండబద్దలు యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు కాటా సుబ్బారావుకు హైకోర్టులో ఊరట లభించింది. అనంతపురం జిల్లా, గుమ్మగట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు గురువారం ఆదేశాలిచ్చారు.మూడు రాజధానుల అంశంపై దుష్ప్రచారం చేయడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి, వైసీపీ నాయకుల పరువుకు భంగం కలిగించేలా తన యూట్యూబ్‌ చానల్‌లో వీడియోలు రూపొందిస్తున్నారని పేర్కొంటూ రాయదుర్గం పట్టణానికి చెందిన రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020 జనవరి 5న గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

*మానవజాతిపై కరోనా మహమ్మారి పంజా విసిరినట్లు రాబోయే రోజుల్లో పశుజాతిపై అటువంటి వైర స్‌లు దాడి చేసే అవకాశాలు ఉన్నాయని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటీవ్‌ చైర్మన్‌ డాక్టర్‌ క్రిష్ణా ఎల్ల అన్నారు. దానిని అధిగమించేందుకు భారతదేశ శాస్త్రవేత్తలు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. రాజేంద్రనగర్‌లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ వెటర్నరీ పథాలజీ కాంగ్రె్‌స-2022లో ఆయన ప్రసంగిస్తూ, పశుజాతులలో మహమ్మారి సంక్రమిస్తే దాని ప్రభావం వ్యవసాయ రంగం, ఆహార రంగంపై తీవ్రంగా ఉంటుందన్నారు. పశువైద్య రోగ నిర్ధారణలో కృతిమ మేధస్సు, సాంకేతికలను అనుసంధానం చేయాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా వెటర్నరీ పాథాలజీ విభాగంలో అత్యుత్తమ సేవలందించిన వారికి అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో రాజేంద్రనగర్‌ వెటర్నరీ కళాశాలకు చెందిన డాక్టర్‌ ఎం.లక్ష్మణ్‌, తిరుపతి, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ కె.సుజాత, ఉత్తరభారతానికి చెందిన డాక్టర్‌ కుల్దీప్‌ గుప్తా ఉన్నారు.

*అలనాటి సినీ నటుడు టీఎల్‌ కాంతారావు కుటుంబసభ్యుల పరిస్థితిపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంతారావు కుటుంబానికి చేయూతనందించే కార్యక్రమం చేపడితే తనవంతుగా తన వేతనం నుంచి రూ.లక్ష ఇస్తానని ప్రకటించారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కాంతారావు శత జయంతి మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కళ్ల మధ్య సింధూరంలా వెలుగొందిన కాంతారావు తెలంగాణకు చెందిన వారు కాకుంటే.. అప్పట్లోలోనే ఆయనకు ఆర్థిక చేయూత లభించి ఉండేదన్నారు.

*రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి ‌జరుగుతోందని ఆధారాలతో‌ చెబుతున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపోరు సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రజలకు వివరించామన్నారు. వైసీపీ (YCP) వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ కార్యాచరణ సిద్ధం చేశామని, ఎక్కడికక్కడ పోరాటాలు చేసి, ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. గన్నవరం విమానాశ్రయంలో స్థానిక పోలీసులతో రక్షణ ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ (TDP), వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయని, దీనిపై కేంద్ర విమానయానశాఖ మంత్రికి లేఖ రాశానన్నారు. సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు ఎయిర్‌పోర్టులో ఎందుకు లేవని ప్రశ్నించారు.

* హైదరాబాద్: నగరంలోని మాజీ మంత్రి నారాయణ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలపై సీఐడీ విచారిస్తోంది. 160 సీఆర్పీసీ కింద నారాయణ కు ఇప్పటికే నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ… ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరుకాలేమని నారాయణ తరుపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో నారాయణను హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో విచారించుకోవచ్చని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో నారాయణను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు… మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ విచారణ చేయనుంది.

* ఆక్వా రైతులపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు గుడివాడలో ఆందోళన చేపట్టారు. గుడివాడ మత్స్య శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రొయ్యకు మద్దతు ధర ప్రకటించి, విద్యుత్ సబ్సిడీలను పునరుద్ధరించాలంటూ ఆక్వా రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆక్వా రైతుల సమస్యలపై ముఖ్యమంత్రికి రాసిన లేఖను మత్స్య శాఖ అధికారులకు మాజీ ఎమ్మెల్యే రావి అందజేశారు. దయచేసి తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆత్మహత్యే రైతులకు శరణ్యమని హెచ్చరించారు.

* పులివెందులలోని రాజీవ్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు శైలజానాథ్‌ తులసిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ… మోదీ కాళ్లను తప్ప ముఖం చూడలేని ధైర్యవంతుడు జగన్‌ అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దగ్గర జగన్ ప్రస్తావించలేకపోయారని విమర్శించారు. అసమర్థ పాలకుడిని పక్కకు తప్పించాల్సిన సమయం వచ్చిందని శైలజానాథ్‌ పేర్కొ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య ఓ వైపు మాటల-తూటాలు పేలుతుంటే.. మరోవైపు ఇరుపార్టీల కార్యకర్తలు మాత్రం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.

* తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య ఓ వైపు మాటల-తూటాలు పేలుతుంటే.. మరోవైపు ఇరుపార్టీల కార్యకర్తలు మాత్రం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. కవిత పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లో పర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారు. ఇదిలా ఉంటే.. ‘ఇష్టం వచ్చినట్లు వాగితే.. నిజామాబాద్ చౌరస్తాలో అరవింద్‌ను చెప్పుతో కొడతానని’ కవిత ఘాటుగా హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. మరోవైపు అరవింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు కూడా ప్రగతిభవన్‌ ముట్టడికి వ్యూహం రచించారు. బీజేపీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు-బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్.. టెన్షన్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్నారు.