Politics

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తా..: చంద్రబాబు

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తా..: చంద్రబాబు

టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ లాయర్లు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోటీగా టీడీపీ శ్రేణులు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీసు వద్ద ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన చంద్రబాబును లాయర్లు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాను.. ప్రజలకు తప్ప మరెవ్వరికీ భయపడను.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తా.. నన్ను రెచ్చగొట్టిన వాళ్ల పతనం ఖాయం.. వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి’’ అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, వైసీపీ పేటీఎమ్ బ్యాచ్‌ తనపైనే దాడి చేయాలనుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధాని చేస్తామంటే జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.