NRI-NRT

రియాధ్‌లో ఘనంగా కార్తీక మాస వనభోజనం

రియాధ్‌లో ఘనంగా కార్తీక మాస వనభోజనం

‘‘న కార్తీకసమో మాసో న కృతేన సమం యుగమ్‌, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్‌” అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనే లేదు అని అర్ధం, అందుకే కార్తీకం వచ్చిందంటే చాలు తెలుగు కుటుంబాలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా కార్తీక కర్తవ్యాన్ని పాటిస్తారు. అది ఎడారయినా మరో ప్రదేశమైనా భక్తి, ఆరాధానకు అడ్డంకి కాదు.
1-6b3830530c
కార్తీకంలో శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడనేది భక్తుల విశ్వాసం. అందుకే యాంత్రిక నగర జీవనానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో సంపూర్ణంగా అధ్యాత్మిక శైలీలో రియాధ్ శివారులో ఒక ఖజ్జురపు తోటలో రియాధ్ నగర ప్రవాసీ తెలుగు కుటుంబాలు కార్తీక వనభోజనాలను శనివారం ఆత్మీయంగా నిర్వహించారు. రాజధాని నగరంలో దక్షిణాది వంటకాలకు పెట్టింది పేరయిన గీతా శ్రీనివాస్, తెలుగుతనమే ధ్యేయంగా ముందుండే చిట్లూరి రంజిత్ కుమార్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు తమ పాకశాల అభిరుచులకు అనుగుణంగా విశిష్ట వంటకాలను వండించి తీసుకోవచ్చారు.
2-6a41f90157
కార్తీక మాసం మొదలయినప్పటి నుండి నగరంలోని తెలుగు కుటుంబాలన్నీ కూడా తమ భక్తి పారవశ్యాన్ని ఆనందోత్సహాల మధ్య చాటుతున్నారు. వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ళలో సహస్ర లింగార్చన తదితర ధార్మిక కార్యక్రమాలను జరుపుకోంటున్నారు. ఇక ప్రతి సోమవారం తమ ఇళ్ళల్లో సహస్ర లింగార్చనను జరుపుకోవడంతో పాటు ఉపవాసాలు పాటించి శివానుగ్రహం పొందారు. తాటి మల్లిఖార్జున్ – శ్రీదేవి దంపతులు కార్తీక మాసం సంధర్భంగా ఇచ్చిన ఉపవాస దీక్షకులకు ఇచ్చిన అతిథ్యం అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది. అదే విధంగా నగరం నడిబొడ్డున మినీ ఆంధ్రప్రదేశ్‌గా పిలువబడే ఒక నివాస సముదాయంలో కొరులపు సూర్య దంపతులు, నిర్వహించిన భక్తి కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించగా చిట్లూరి రంజిత్ కుమార్ – సింధూ దంపతుల అర్చనలు, అభిషేకాలు కూడా కార్తీక విశిష్టతను చాటాయి.
4-2478d5f67e
ప్రవాసీ తెలుగు సంఘమైన సాటా కూడ తమ వంతుగా వన భోజనాలకు సహాకరించింది. సాటా అధ్యక్షుడు మల్లేషన్, శాంతి దంపతులు ప్రత్యెకంగా జెద్ధా నుండి వచ్చి వెలుగు నింపగా స్థానికంగా ఉండే ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ శేఖ్ కుటుంబ సమేతంగా పాల్గోని ప్రత్యెకత చాటారు. చందన, లక్ష్మి, సుచిత్ర శంకర్, రమ్య, మహేంద్ర, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
5-9f1de2fad6
Dubai-304ebedd0a
picture hosting sites