Uncategorized

క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఇషా అంబానీ

క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఇషా అంబానీ

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త. రిల‌య‌న్స్ చైర్మ‌న్ ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఒక బాబు, ఒక పాప జన్మించిన‌ట్లు ఇషా కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు అదియా, కృష్ణ అని నామ‌క‌ర‌ణం చేశారు.ఈ సంద‌ర్భంగా అంబానీ కుటుంబ స‌భ్యులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇషా, ఆనంద్ పిర‌మిల్ త‌ల్లిదండ్రులు అయ్యార‌నే విష‌యం మీకు చెప్ప‌డానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఆ దంప‌తుల‌కు న‌వంబ‌ర్ 19న ఇద్ద‌రు క‌వ‌ల‌లు జ‌న్మించారు. పాప అదియా, బాబు కృష్ణ ఆరోగ్యంగా ఉన్నార‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అదియా, కృష్ణ‌, ఇషా, ఆనంద్‌కు ఆశీర్వాదంతో పాటు శుభాకాంక్ష‌ల‌ను మీ నుంచి కోరుకుంటున్నామ‌ని తెలిపారు. ఇషా, ఆనంద్‌కు 2018లో వివాహ‌మైన విష‌యం విదిత‌మే.