DailyDose

నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయి

Auto Draft

: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో ఆయన పాల్గొని.. ఆక్వా వర్సిటీకి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలోనే ఆక్వా వర్సిటీలు ఉన్నాయని, మూడో వర్సిటీ నరసాపురంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారుల బాగు కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9 హార్బర్లు రాబోతున్నాయన్నారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆయిల్ డ్రిల్లింగ్ కార్యక్రమాల వలన నష్టపోయిన 20 వేల మంది మత్స్యకారులకు రూ. 108 కోట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మత్స్యకారులు వలసలు పోకుండా వారికి మెరుగైన జీవితం కోసం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. వాటి కోసం రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జగనన్న ప్రభుత్వం అంటే మనం ప్రభుత్వం అని అందరరూ

అనుకునే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కొల్లేరులో 5వ కాంటూరు వరకు నీరు నిల్వ ఉండేలా రూ. 108 కోట్లతో రెగ్యులేటర్ నిర్మాణం చేపడుతున్నామని, జిల్లాలో చాలా విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. గోదావరి పక్కనే ఉన్నా తాగునీరు కొరత ఉందని, వశిష్ట గోదావరిపై నరసాపురం వద్ద వంతెన నిర్మాణానికి జనవరిలో టెండర్లు పిలుస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు